అనుష్కపై మనసు పడ్డ మణిరత్నం. ఆ పాత్ర కోసం స్వీటీపై ఆసక్తి  

మణిరత్నం సినిమాలో అనుష్క. .

Manirathnam Concentrate On Anushka For His Next Movie-jayam Ravi,karthi,manirathnam,mohan Babu,next Movie,vikram

సౌత్ ఇండియా దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ అయిన పోన్నియన సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో ఈ సినిమాని మణిరత్నం ఆవిష్కరిస్తున్నారు. టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు...

అనుష్కపై మనసు పడ్డ మణిరత్నం. ఆ పాత్ర కోసం స్వీటీపై ఆసక్తి-Manirathnam Concentrate On Anushka For His Next Movie

కార్తీ, జయంరవి, విక్రమ్, టాలీవుడ్‌ నుంచి మోహన్‌బాబు, మాలీవుడ్‌ నుంచి కీర్తీ సురేశ్, బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ వంటి వారు నటించనున్నారు. దీంతో సినిమా మీద అన్ని భాషలలో కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో పూంగుళలి అనే పాత్ర కోసం అగ్రనటి నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం మణిరత్నం బాహుబలి దేవసేన అనుష్క ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇలాంటి పాత్రలలో రాణించి తనదైన ముద్ర వేసిన అనుష్క అయితే ఆ పాత్రకి కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని మణిరత్నం అనుష్కతో సంప్రదింపులు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక అనుష్క ఈ సినిమాలో నటిస్తే సినిమాపై మరిన్ని హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.