ఉప ఎన్నిక తర్వాతే నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవిపై అధిష్టానం తర్జన భర్జన పడుతుంది.మొదటి నుండి పార్టీని నమ్ముకున్న సీనియర్ నాయకులు ఉన్నారు.

వారిని కాదని కొత్త వారికి ఆ పదవి కట్టబెడుతే అసలుకే ముప్పు వచ్చేలాగా ఉంది.ఈ విషయంపై సీనియర్ నాయకుడు జానా రెడ్డి అధిష్టానం కు గతంలో లేఖ రాశాడు.

Manikyam Tagore Video Confference With T Congress Leaders, Manikyam Tagore, Reva

ఇప్పుడు ఆయన రాసిన లేఖ ద్వారానే నిర్ణయం తీసుకునే ఆలోచనలో అధిష్టానం ఉంది.నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీ పదవిపై ఓ క్లారీటి ఇవ్వనున్నది.

ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చర్చించినట్లుగా సమాచారం.ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

పీసీసీ పదవిని ఇప్పుడు ప్రకటించాలా లేక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత ప్రకటించాలా అనే అంశం పై చర్చజరిగినట్లుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు.ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ పదవిని ప్రకటించాలని సీనియర్ నాయకులు స్పష్టం చేశారు .అదే విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించినట్లుగా నేతలు తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు