కరోనా నేపథ్యంలో మమత సర్కార్‌ సంచలన నిర్ణయం

ప్రపచం వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వేలను దాటేసి లక్షల్లో చేరింది.మృతుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.

తగ్గినట్లుగా అనిపిస్తూ మళ్లీ పెరుగుతూనే ఉంది.ఇండియాలో కరోనా కాస్త మెల్లగా విస్తరిస్తుంది.

దేశంలో అమలు అవుతున్న లాక్‌డౌన్‌ పని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగినట్లయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశ్యంతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై కరోనా పాజిటివ్‌ అని తేలిన వారు హాస్పిటల్‌కు వచ్చి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఎట్టి పరిస్థితుల్లోనే వారికి ప్రభుత్వం సరైన చికిత్స అందిస్తుంది.

Advertisement

కాని వారు ఇకపై ఇంటి వద్దే ఉండనున్నారు.కొన్ని లక్షల మందికి వైరస్‌ సోకిన సమయంలో వారందరిని కూడా ఒక్క చోట ఉంచి చికిత్స అందించడం ఎవరికి సాధ్యం అయ్యే పని కాదు.

అందుకే ఇకపై ఎవరి ఇంట్లో వారే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అయితే ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కేసులు పెరిగిన సమయంలో అలాంటి నిర్ణయం తీసుకుంటే పర్వాలేదు.ఇప్పుడు ఎందుకు అంతటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

.

ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..
Advertisement

తాజా వార్తలు