తమిళనాడులో మమతా బెనర్జీ పెళ్లి!

విస్తుగొలిపించే ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.వరుడి పేరు కమ్యూనిజం ప్రస్తుతం ఆ శుభలేక సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

నిజానికి అది ఓ సీపీఐ నేత కుమారుడి పెళ్లిపత్రిక.అతనికి కమ్యూనిజంపై ఉన్న ఇష్టంతో ఆ పేరు పెట్టాడు.

ఆ పత్రికలో వారి పేర్లు ఏఎం కమ్యూనిజం,ఏఎం లెనినిజం అని ఉండటం గమనార్హం.ఈ సందేహానికి పెళ్లికుమారుడి తండ్రి తెరదించారు.

అసలు ఆ శుభలేక నిజమేనా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు.ఆ పత్రిక నిజమే! సేలం సీపీఐ కార్యదర్శి లెనిన్‌ మోహన్, ఆ పేర్ల వెనుక ఉన్న కారణాన్ని తెలిపారు.

Advertisement
Mamata Banerjee Marriage In Tamilnadu Invitation Going Viral. Communism, Mamata

అతనికి కమ్యూనిజంపై ఉన్న అభిమానంతో కుమారులకు ఆ పేర్లు పెట్టినట్లు తెలిపారు.కేవలం మోహనే కాదు వాళ్ల స్వగ్రామం కత్తూరులో ఎక్కువ శాతం కమ్యూనిజాన్ని అభిమానిస్తారు.

అందుకే ఆ ఊళ్లో ఉన్న వాళ్ల పేర్లు రష్యా, మాస్కో, రొమెనియా, వియత్నాం వంటి పేర్లు పెట్టుకోవడం సాధారణం.పెళ్లి కుమార్తె కూడా తమ చుట్టాల అమ్మాయని, ఆమె తాతయ్యకు కాంగ్రెస్‌పై ఉన్న అభిమానంతో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనార్జీ పేరును పెట్టారు.

అలాగే తన మనవడి పేరు మార్క్సిజం అని భవిషత్తులో తమకు మనవరాలు పుడితే క్యూబాయిజం అని పెడతామని చెప్పారు.శుభలేఖను సీపీఐ అధికారిక పత్రిక ‘జనశక్తి’లో సోమవారం ప్రచురించడంతో ఆ పత్రిక అందరి దృష్టిని ఆకర్షించిందని మోహన్ వ్యాఖ్యానించారు.

ఇది నిజమా? కాదా ? అని నిర్ధారించుకోడానికి మూడు రోజులుగా తనకు తెలిసినవారి మీడియా నుంచి 300 పైగా ఫో¯Œ కాల్స్‌ వచ్చినట్టు చెప్పారు.

Mamata Banerjee Marriage In Tamilnadu Invitation Going Viral. Communism, Mamata
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

విభిన్నమైన పేర్లు పెట్టుకున్నందుకు అందరూ అభినందిస్తుండటంతో తన కుమారులు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు.అయితే వీరి వివాహాం జూన్‌ 13న జరగనుంది.తన భార్య గర్భవతిగా ఉన్నపుడు సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత కమ్యూనిజం జాడలు కనిపించవని.

Advertisement

ఇక ఆ సిద్ధాంతాన్ని ఎక్కడా ఆచరించరని దూరదర్శన్‌లో న్యూస్‌ క్లిప్పింగ్‌ వేశార ట.

అప్పుడే అతని భార్యకు కుమారుడు పుట్టాడు.దీంతో ఆ గుర్తుగా పెద్ద కుమారుడికి కమ్యూనిజం అని పెట్టాడట.అంతేకాదు.

అతని పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని, పేర్ల కారణంగా అవమానాలను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు.కానీ, వారంతా కాలేజీకి వచ్చేసరికి పరిస్థితి మారిందన్నారు.

పెద్ద కొడుకు న్యాయవాద డిగ్రీని పూర్తిచే శాడు.మిగతా ఇద్దరూ బీకామ్‌ చదువుకున్నారని తెలిపారు.

తాజా వార్తలు