ముసలి వయసులో లవ్ చేసింది.. కట్ చేస్తే 4 కోట్లు గోవిందా..

ఆన్‌లైన్ మోసాలు( Online Scam ) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

తాజాగా మలేషియాలో( Malaysia ) ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.67 ఏళ్ల వృద్ధురాలిని ప్రేమ పేరుతో నమ్మించి ఏకంగా రూ.4 కోట్లకు పైగా మోసం చేశాడు ఓ సైబర్ కేటుగాడు.ఈ ఘటనతో ఆన్‌లైన్ సంబంధాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.పేరు వెల్లడించని ఓ మహిళకు 2017 అక్టోబర్‌లో ఫేస్‌బుక్‌లో( Facebook ) ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.

తాను అమెరికాకు( America ) చెందిన ప్రముఖ వ్యాపారవేత్తనని, మలేషియాకు షిఫ్ట్ అవుతున్నానని నమ్మబలికాడు.మాటలతో మాయ చేసి ఆమె నమ్మకాన్ని చూరగొన్నాడు.

ఆ తర్వాత అసలు కథ మొదలైంది.రకరకాల కారణాలు చెప్పి ఆమె వద్ద డబ్బులు గుంజడం ప్రారంభించాడు.

Advertisement

మొదట్లో చిన్న మొత్తాల్లో డబ్బులు తీసుకున్నాడు.ఆ తర్వాత వ్యాపారంలో పెట్టుబడి, అత్యవసర పరిస్థితులు అంటూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు.

ఇలా దాదాపు ఐదేళ్లలో ఆ వృద్ధురాలు( Old Woman ) ఏకంగా రూ.4.4 కోట్లు పోగొట్టుకుంది.మోసగాడు చెప్పిన కల్లబొల్లి కబుర్లను నమ్మి విడతల వారీగా 50 వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి 306 సార్లు డబ్బు పంపింది.

కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద అప్పులు చేసి మరీ అతనికి డబ్బులు పంపింది.ఎంతో డబ్బు పంపింది కానీ ఒక్కసారి కూడా అతని కలవలేదు అంతేకాదు కనీసం ఒక వీడియో కాల్ చేయమని కూడా అడగలేదు.

అతన్ని అంత గుడ్డిగా నమ్మేసింది.

పాతిక లక్షల సహాయం అబద్దం.. కాంగ్రెస్ రెబల్ లీడర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
ఈ వీడియో చూస్తే భారతీయులుగా సిగ్గుపడతారు!

ఏడేళ్ల తర్వాత అంటే 2024లో ఆమె ఈ మోసగాడి గురించి తన క్లోజ్ ఫ్రెండ్ తో చెప్పింది.అప్పటికి గానీ తాను మోసపోయాననే విషయం ఈ వృద్ధురాలికి బోధపడలేదు.ఫ్రెండ్ వల్ల స్కాం గురించి తెలుసుకున్న ఈ ఓల్డ్ ఉమెన్ డిసెంబర్ 17న పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

కానీ ఏం లాభం, ఈమె ఇప్పుడు మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంటోంది.కాగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఆర్థిక సహాయం అభ్యర్థనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు