మహేష్ - రాజమౌళి మూవీ బడ్జెట్ అన్ని కోట్లా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమా జులై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం అందుతుంది.11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను వచ్చే సంక్రాంతిని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఇప్పుడు మన టాలీవుడ్ సినిమాలు కోట్ల రుపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

Advertisement

రాజమౌళి గత చిత్రం అయినా ఆర్ ఆర్ ఆర్ కోసం 400 కోట్లకు పైగానే ఖర్చు చేసారు.ఇలా రాజమౌళి ఒక్కో సినిమాకు బడ్జెట్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

ఇక ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా ఎంత బడ్జెట్ కేటాయిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మహేష్ బ్రాండ్ ఇమేజ్, క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఎక్కువుగానే పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

పైగా ఈ సినిమా అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ కావడంతో రాజమౌళి ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండాలని ప్లాన్ చేస్తాడు.అలాగే భారీ తారాగణం, విదేశీ సాంకేతిక నిపుణులు కూడా తప్పకుండ ఉంటారు.

అందుకే ఈ సినిమా కోసం బడ్జెట్ ఎంత అంటే.అక్షరాలా 500 నుండి 600 కోట్ల మధ్య ఉంటుంది అని టాక్ ఒకటి వినిపిస్తుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇంకా సెట్స్ మీదకు వెళ్ళాక అనుకున్న దానికన్నా కూడా బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉంది.ఈ సినిమాకు నిర్మాతగా కే ఎల్ నారాయణ వ్యవహరించ నున్నారు.అలాగే ఇంకా భాగస్వాములను కూడా చేర్చుకునే అవకాశం ఉంది.

Advertisement

మరి మహేష్ బాబు కూడా ఈ భారీ ప్రాజెక్ట్ లో నిర్మాతగా వ్యవహరిస్తారో లేదో చూడాలి.

తాజా వార్తలు