గోవాలో మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్..!

సూపర్ స్టార్ మహేష్ ఆగష్టు 9న బర్త్ డే జరుపుకోనున్నారు.

బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా సర్కారు వారి పాట బర్త్ డే బ్లాస్టర్ రాబోతుందని తెలుస్తుంది.

ఉదయం 9 గంటల 9 నిమిషాలకే సర్కారు వారి పాట టీజర్ రిలీజ్ చేస్తున్నారు.ఇక సర్కారు వారి పాట టీం లోనే మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఉంటాయని తెలుస్తుంది.

గోవాలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ జరుగుతుంది.ఈ షూటింగ్ స్పాట్ లోనే మహేష్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు.

ముందు మహేష్ షూటింగ్ లో పాల్గొనేందుకు గోవా వెళ్తుండగా తర్వాత మహేష్ ఫ్యామిలీ నమ్రత, గౌతం, సితారలు కూడా గోవా చేరుకుంటారని తెలుస్తుంది.గోవాలో బర్త్ డే సెలబ్రేషన్స్ భారీగా ప్లాన్ చేసినట్టు టాక్.

Advertisement

ఇక ఈ బర్త్ డే సందర్భంగా తన ఫ్యాన్స్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మహేష్.ప్రతి అభిమాని 3 మొక్కలు నాటి ఆ ఫోటోలను తనకు ట్యాగ్ చేయాలని అన్నారు మహేష్.

మహేష్ కోరినట్టుగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటారో చూడాలి. పరశురాం డైరెక్ట్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు