గుంటూరు కారం నా చివరి సినిమా కావచ్చు.. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మహేష్ బాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం(Gunturu Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

జనవరి 12 వ తేదీ విడుదల అయిన ఈ సినిమా మొదట్లో కాస్త నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం భారీగా వసూళ్లు రాబడుతోంది.

ఇకపోతే ఇటీవల చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.స్వయంగా మహేష్ బాబు ఈ సినిమా సక్సెస్ పార్టీని అరెంజ్ చేశారు.

  ఈ పార్టీ అనంతరం మహేష్ బాబు యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా తాను తెలుగులో ఇక పై సినిమాలు చేయకపోవచ్చు అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు స్లాంగ్, మాస్ డాన్సులు అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Advertisement

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో రెండు మాస్ పాటలు( Mass Songs ) ఉండాలని నేను త్రివిక్రమ్(Trivikram Srinivas) గారు ముందుగానే అనుకున్నామని తెలిపారు.

ఈ సినిమా తరువాత నేను మళ్ళీ రీజినల్ సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు.ఇదే నా చివరి తెలుగు సినిమా కావొచ్చు.కాబట్టి మళ్ళీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో ఉండదు అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు చేసినటువంటి వ్యాఖ్యల వైరల్ అవుతున్నాయి ఇదే ఆఖరి సినిమా కావచ్చు అంటే ఈయన ఇకపై తెలుగు సినిమాలు( Telugu Movies ) చేయరా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో గోడౌన్ లో నెక్లెస్ గొలుసు పాట పెట్టినప్పుడు కాన్ఫిడెంట్ గా డాన్స్ చేయాలని నిర్ణయించుకున్నాను కానీ శ్రీలీల డాన్స్ చూసి భయమేసిందంటూ ఈయన చేసిన వ్యాక్యాలు వైరల్ అవుతున్నాయి.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు