అరబిక్ కుత్తు ముందు కళావతి జాడే లేదు.. ఏం థమన్‌ ఇదేనా నీ సత్తా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట నుండి మొదటి సాంగ్ ని వాలెంటెన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ పాటకు మహేష్ బాబు అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ మధ్య కాలంలో తమన్ జోరు మామూలుగా లేదు.

ఆయన ప్రతి సినిమా పాటలు కూడా మంచి సక్సెస్ దక్కించుకుంటున్నాయి.అందుకే సర్కారు వారి పాట సినిమా లోని పాటలు అన్ని కూడా ఖచ్చితంగా మంచి సక్సెస్ ను దక్కించుకుంటాయని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో మొదటి పాట కళావతి రూపం లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి పాటకు మంచి స్పందన దక్కింది.లిరిక్స్ విషయంలో కాస్త విమర్శలు ఎదురైనా కూడా మొత్తానికి అభిమానులు మాత్రం ఈ పాటను తెగ ఆదరిస్తున్నారు.

Advertisement

మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ఎనిమిది లక్షలకు పైగా లైక్స్ దక్కాయి.ఇది అరుదైన రికార్డు అంటూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ సమయంలో వచ్చిన తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా బీస్ట్ యొక్క అరబిక్ కుత్తు పాట ఓ రేంజ్ లో సోషల్ మీడియాను యూట్యూబ్ ను ఊపి పారేస్తుంది.కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే మిలియన్ లైక్స్ తో ఈ పాట దుమ్ము దులిపేసింది.24 గంటలు ముగియక ముందే పాటకు ఏకంగా రెండు మిలియన్ల లైక్స్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.లైక్స్ విషయంలో కళావతి ముందు అరబిక్ కుత్తూ బీస్ట్ సాంగ్ హైలెట్ గా నిలిచింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

తమన్ సంగీత సారధ్యంలో వచ్చిన కళావతి ని మించి పది రెట్లు అనిరుద్ రవిచంద్రన్ సంగీత సారధ్యంలో వచ్చిన బీస్ట్ సాంగ్ అరబిక్ కుత్తూ సూపర్ హిట్ అయింది అంటూ తమిళ ఆడియన్స్ సోషల్ మీడియాలో తెలుగు ఆడియన్స్ ను ట్రోల్‌ చేస్తున్నారు.ట్విట్టర్లో ఎప్పటికప్పుడు విజయ్ మరియు మహేష్ బాబు ల అభిమానుల మధ్య పోటీ ఉంటుంది.

ఈ విషయంలో మాత్రం మహేష్ బాబు అభిమానులు చేతులెత్తేసారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు