అయోధ్య చరిత్రకు సాక్ష్యంగా నిలవడం గర్వంగా ఉంది.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గుంటూరు కారం( Guntur Karam ) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా అదరగొట్టింది.

సెకండ్ వీక్ తర్వాత కలెక్షన్లు నెమ్మదించినా సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలలో ఈ సినిమానే టాప్ లో నిలిచింది.అయితే ఈరోజు అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరగడంతో మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

మహేష్ బాబు ఆ ట్వీట్ లో అయోధ్య( Ayodhya ) చరిత్రకు సాక్ష్యంగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.చరిత్ర యొక్క ప్రతిధ్వనులు, విశ్వాసం యొక్క పవిత్రత మధ్య అయోధ్యలో రామమందిరాన్ని( Ram Mandir ) గొప్పగా ప్రారంభించడం ఐక్యత, అధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుందని ఇటువంటి చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు గర్వంగా ఉందని మహేష్ బాబు పేర్కొన్నారు.

మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ కు 50,000కు పైగా లైక్స్ వచ్చాయి.

Mahesh Babu Comments About Ayodhya Ram Mandir Details, Mahesh Babu, Ayodhya, Ram
Advertisement
Mahesh Babu Comments About Ayodhya Ram Mandir Details, Mahesh Babu, Ayodhya, Ram

మహేష్ బాబు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా త్వరలో షూటింగ్ తో బిజీ కానున్నారు.మహేష్ తర్వాత మూవీ రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు కేఎల్ నారాయణ మాత్రమే నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతుండటం గమనార్హం.

Mahesh Babu Comments About Ayodhya Ram Mandir Details, Mahesh Babu, Ayodhya, Ram

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బెస్ట్ హిట్ ను ఈ సినిమాతో సొంతం చేసుకునే ఛాన్స్ ఉండగా మహేష్ బాబు ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.మహేష్ బాబు క్రేజ్ ను ఈ సినిమాతో 100 రెట్లు పెంచుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ బాబు కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు