యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెడుతున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సూపర్ హిట్ కాగా ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో ఓ చిన్న జాలీ ట్రిప్ వేసి వచ్చారు మహేష్.

ఇక త్వరలో త్రివిక్రం తో సినిమా స్టార్ట్ చేయనున్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం జూలై నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని అంటున్నారు.త్రివిక్రం, మహేష్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ లోనే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.మహేష్ సినిమాలు మ్యాక్సిమం యాక్షన్ సీన్స్ తోనే స్టార్ట్ అవుతాయి.

అది కూడా ఒక సెంటిమెంట్ అని చెప్పొచ్చు.త్రివిక్రం తో సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ఉంటుందని అంటున్నారు.

Advertisement

ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నారు.త్రివిక్రం సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేయనున్నారు.2023లోనే జక్కన్నతో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి సినిమాకు కథ సిద్ధమని ఓ పక్క అంటుంటే కథ విషయంలో ఇంకా డిస్కషన్స్ ఫైనల్ అవలేదని మహేష్ అంటున్నాడు.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు