రాజస్థాన్ - చెన్నై మధ్య మ్యాచ్లో ఓటమిపై స్పందించిన మహేంద్రసింగ్ ధోని..!

తాజాగా రాజస్థాన్- చెన్నై( Chennai Super Kings , ) మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.

కేవలం మూడు పరువుల తేడాతో చెన్నై జట్టు ఓటమిని చవిచూసింది.

ఆఖరి ఓవర్లో చెన్నై జట్టు 21 పరుగులు చేయాల్సి ఉండగా.మహేంద్రసింగ్ ధోని రెండు సిక్స్ లు కొట్టి అందరిలో ఉత్కంఠ రేకెత్తించాడు.

చివరి బంతికి ఐదు పరుగులు అవసరం ఉండగా.మహేంద్రసింగ్ ధోని సిక్స్ కొట్టి జట్టును గెలిపిస్తాడు అనుకుంటే.

ఒక్క పరుగు తీసి మూడు పరుగుల తేడాతో ఓటమిని ఖాతాలో వేసుకున్నారు.

Advertisement

తాజాగా జరిగిన మ్యాచ్ పై మహేంద్రసింగ్ ధోని( MS Dhoni ) స్పందిస్తూ తమ జట్టు ఆఖరి బంతి వరకు అద్భుతంగా పోరాటం చేసింది.కానీ మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ కాస్త స్లో అవ్వడంతో ఓడిపోవలసి వచ్చింది.

పిచ్ అనుకూలంగా ఉన్నప్పటికీ అశ్విన్, చహల్ ( Ashwin ) వంటి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తమ జట్టు బ్యాటర్లు కాస్త తడబడ్డారని, ఈ లక్ష్యం చేదించడం పెద్ద కష్టమేమి కాదు.తాను రవీంద్ర జడ్జ కలిసి మ్యాచ్ గెలిపించాలి అనుకున్నాం కానీ లక్ష్యానికి మూడు పరుగుల దూరంతో విఫలం అయ్యామని తెలిపాడు.

ఏ మ్యాచ్ లోనైనా ప్రత్యర్థి బౌలర్ ను ఒత్తిడి లోకి నెట్టాలి.అప్పుడు వారు వేసే ప్రతి బంతిని స్టాండ్స్ కు పంపవచ్చు.నేను కూడా అలాగే ప్రయత్నం చేశాను.

నా ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది.ఈ మ్యాచ్లో తమ బౌలర్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని, తాను కెప్టెన్ గా ఆడే మ్యాచ్లలో ఇది 200 వ మ్యాచ్ అనే విషయం తనకు గుర్తులేదని తెలిపారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

తమ జట్టు అంతా 100% ఎఫెక్ట్ పెట్టామని, దురదృష్టవశాత్తు మ్యాచ్ చివరి వరకు వచ్చి స్వల్ప పరుగులతో ఓడిపోవలసి వచ్చిందని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు