మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ జయశీల ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం మహాత్మ గాంధీ చిత్రపటానికి ఎంపీడీవో జయశీల మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జయశీల మాట్లాడుతూ బ్రిటిష్ సంకెళ్లను తెంచి భారతదేశనికి స్వాతంత్ర్యం తీసుకవచ్చి మహాత్మా గాంధీ జాతిపితగా మారారని అన్నారు.అహింస మార్గాన్ని ఆయుదంగా చేసుకొని భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్య్రం ప్రసాదించారని అన్నారు.

స్వాతంత్య్రం రావడానికి మహాత్మా గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.అనంతరం ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి , డైరెక్టర్లు కల్లెపల్లి సతీష్ ,మెరుపుల మహేష్ , గంగి పెల్లి లచ్చయ్యా , సూపరిండెంట్ రవీందర్ సీనియర్ అసిస్టెంట్ సురేష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, టైఫీస్ట్ వంశీకృష్ణ సిబ్బంది ఉన్నారు.

Advertisement
ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్...వర్కౌట్ అవుతుందా..?

Latest Rajanna Sircilla News