వెండితెరపై శివుడిగా కనిపించి అలరించిన హీరోలు వీళ్ళే!

సినీ పరిశ్రమలలో ఎక్కువగా వినోదాన్ని అందించే సినిమాలే కాకుండా దైవం తో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి.

శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, శివుడు ఇలా ఎన్నో రకాల కథలను తెరకెక్కించారు దర్శకుడు.

అంతేకాకుండా బుల్లితెరలో కూడా ఈ దేవుళ్ల సీరియల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే వెండితెరపై రాముడిగా పాత్రలు చేయడమే కాకుండా శివుడి పాత్రలో కనిపించిన హీరోలు కూడా ఉన్నారు.

ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో ఎన్నో దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తెరకెక్కాయి.

ఇదిలా ఉంటే శివుడికి సంబంధించిన సినిమాలు కూడా తెరకెక్కగా అందులో శివుడి పాత్రలో మెప్పించిన నటులు ఎవరో చూద్దాం.సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.

Advertisement

ఇక ఈయన దక్షయజ్ఞం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ సినిమాల్లో శివుడి పాత్ర చేశారు.ఇక అక్కినేని నాగేశ్వరరావు శివుడిగా చేయకపోయినా ఓ పాటలో కొన్ని సన్నివేశాలలో శివుడిగా కనిపించారు.

ఇక శోభన్ బాబు కూడా పరమానందయ్య శిష్యుల కథ సినిమా లో శివుడి పాత్రలో నటించారు.రెబల్ స్టార్ కృష్ణంరాజు వినాయక విజయం అనే సినిమాలో శివుని పాటలు మెప్పించారు.

ఇక సీనియర్ నటుడు బాలయ్య జగన్మాత, భక్త కన్నప్ప సినిమాలలో శివుడి పాత్ర చేశారు.

ఇక మాయామశ్చీంద్ర అనే సినిమాలో సీనియర్ హీరో రామకృష్ణ శివుడి పాత్రలో బాగా నటించాడు.ఇక ఏకలవ్య సినిమా లో రంగనాథ్ శివుని పాత్ర లో నటించారు.ఇదిలా ఉంటే మంజునాథ సినిమాలో చిరంజీవి శివుడిగా మెప్పించిన సంగతి తెలిసిందే.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

అంతే కాకుండా మరో రెండు సినిమాలు ఆపద్బాంధవుడు, పార్వతీపరమేశ్వరులు అనే సినిమాలో కూడా శివుడిగా నటించారు.

Advertisement

ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ కూడా సీతారామ కళ్యాణం సినిమా లో ఓ పాటలో శివుడిగా బాగా ఆకట్టుకున్నారు.ఇక అక్కినేని నాగార్జున జగద్గురు ఆది శంకర సినిమా లో శివుడిగా కొన్ని సన్నివేశాలు నటించాడు.ఇక హీరో సుమన్ ఎన్నో దైవ పాత్రల్లో నటించగా శ్రీ సత్యనారాయణ మహత్యం సినిమా లో సత్యనారాయణ స్వామి తో పాటు శివుడు బ్రహ్మ గా నటించారు.

ఇక డమరుకం సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా శివుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.హీరో లే కాకుండా మిగతా నటులు కూడా శివుడి పాత్రలో నటించగా మగ రాయుడు సినిమా లో కమెడియన్ మల్లికార్జున కూడా శివుడి పాత్రలో నటించారు.

ఇక విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజనాల ఉషాపరిణయం సినిమాలో మహా దేవుడి పాత్రలో చేశారు.అంతే కాకుండా మరో విలన్ పాత్రలో నటించిన రావు గోపాల్ రావు కూడా మా ఊళ్లో మహా శివుడు సినిమా లో మహా శివుడి గా నటించారు.

ఇక అప్పటి సినిమాల్లో భూకైలాస్, ఉమా సుందరి, నాగుల చవితి వంటి సినిమాల్లో నాగభూషణం శివుని పాత్రలో బాగా మెప్పించారు.అంతేకాకుండా మధుర మీనాక్షి అనే డబ్బింగ్ సినిమాల్లో కూడా ప్రముఖ తమిళ నటుడు విజయ్ కాంత్ కూడా శివుడిగా నటించారు.

తాజా వార్తలు