అర్ధరాత్రి పోలీసులను పిలిపించిన మందుబాబు.. ఏం కంప్లైంట్ ఇచ్చాడో తెలిస్తే నవ్వేనవ్వు..

మందుబాబులు చేసే పనులు వింటే ఒక్కోసారి మనము ఆశ్చర్యపోగ తప్పదు.ఒక్కోసారి వారి పనులు చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది.

మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కాదు.కొన్నిసార్లు వారు చాలా ధైర్యం చూపిస్తుంటారు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో (Hardoi, Uttar Pradesh)ఇలాంటి ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.మద్యం తాగిన ఓ వ్యక్తి అర్ధరాత్రి( police) పోలీసులకు ఫోన్ చేశాడు.

ఎవరో తన 250 గ్రాముల బంగాళాదుంపలు దొంగతనం చేశారని తాపీగా ఫిర్యాదు చేశాడు.చాలా విలువైన సంపద కోల్పోయినట్లుగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.

Advertisement

పోలీసులు తన పోగొట్టుకున్న బంగాళాదుంపలు(potatos) కనుక్కోవాలని డిమాండ్ చేశాడు.అయితే అధికారులు అతని ఫోన్ కట్ చేయలేదు అడ్రస్ కనుక్కున్నారు.

అతని ఇంటికి వచ్చి, అతని మాటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.వీడియోలో ఆ వ్యక్తి పోలీసులతో తన బాధ చెప్పుకుంటున్నాడు.

అతను బంగాళాదుంపలు పొట్టు తీసి, తర్వాత వండుకోవడానికి ఇంట్లో పెట్టానని చెప్పాడు.కానీ మద్యం తాగి తిరిగి వచ్చేసరికి బంగాళాదుంపలు కనిపించలేదట.

అందుకే 112కు కాల్ చేసినట్లు వివరించాడు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

ఈ మందుబాబు పేరు విజయ్ వర్మ(Vijay Verma).ఆయన ఫిర్యాదు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో విజయ్ వర్మ తాను మద్యం తాగి ఉన్నానని ఒప్పుకున్నాడు.

Advertisement

అయినా, తన బంగాళాదుంపలు ఎవరు తీసుకెళ్లారో తెలుసుకొని వారిపై కేసు పెట్టాలని పోలీసులను కోరాడు.పోలీసులు విజయ్ వర్మను మాటలు పూర్తిగా విన్నారు.కానీ ఆయన మాటలు విని నవ్వులు ఆపుకోలేకపోయారు.

విజయ్ వర్మ ఏ రకమైన మద్యం తాగాడో కూడా పోలీసులు అడిగారు.విజయ్ వర్మ మాత్రం తాను తాగిన మద్యం తనదే అని, ఎవరి దగ్గర నుంచి అప్పుగా తీసుకోలేదని చెప్పాడు.

తన డబ్బులతో తాను మద్యం తాగితే తప్పేం కాదు కదా అని కూడా తిరిగి ప్రశ్నించాడు.

ఆ వ్యక్తి పోలీసులతో, “నా బంగాళాదుంపలు ఎవరో తీసుకెళ్లారు.సుమారు 250 గ్రాములు ఉంటాయి.నేను నాలుగు గంటలకు పొట్టు తీసి, తర్వాత వండుకోవడానికి పెట్టాను.

తిని తాగి వచ్చేసరికి ఎవరో దొంగ వాటిని తీసుకెళ్లారు.ఈ విషయం మీరు విచారించాలి” అని చెప్పాడు.

వైరల్ వీడియో పైన నెటిజన్లు కామెంట్లు చేస్తూ “ఆయన చాలా నిజాయితీగా ఉన్నాడు.ఆలుగడ్డలు(potato) కాజేసారని చెప్పాడు, ఎవరికీ హాని చేయలేదు, తన డబ్బుతోనే మద్యం తాగుతాడు.

కనీసం నిజం చెప్పాడు, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు” అని కామెంట్ చేశారు.మరొకరు నవ్వుతూ, “ఈ కేసులో సీఐడీ లేదా సీబీఐ వాళ్ళు వెంటనే దర్యాప్తు చేయాలి.

త్వరగా బంగాళాదుంపలు దొరికేలా చూడాలి” అని కామెంట్ చేశారు.

తాజా వార్తలు