బాబు మ్యూజియంను చూస్తే ఫారెన్ కంట్రీలో మ్యూజియంను చూసినట్లు అనిపిస్తుంది-ఏపీ టూరిజం మంత్రి రోజా

ఏపీ టూరిజం మంత్రి రోజా గురువారం ఉదయం బాపు మ్యూజియంను సందర్శించారు.పింగళి వెంకయ్య విగ్రహానికి మంత్రి పూలమాల సమర్పించారు.

అనంతరం విజయవాడలోని బాపు మ్యూజియంలో ప్రాక్, చారిత్రక యుగ గ్యాలరీ, బుద్ధ జైన్ గ్యాలరీ, హిందూ శిల్పకళా గ్యాలరీ, నాణ్యము లు, టెక్స్ టైల్ గ్యాలరీ, ఆయుధాలు కవచాలు గ్యాలరీని రోజా పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.

Looking At The Babu Museum It Feels Like Seeing A Museum In A Foreign Country ,

బాబు మ్యూజియంను చూస్తే ఫారెన్ కంట్రీలో మ్యూజియంను చూసినట్లు అనిపిస్తుందన్నారు.ముందు తరాలు వారు వాడిన సంస్కృతి మనకు చూపించేందుకు వాణిమోహన్ చాలా కృషి చేశారని కొనియాడారు.రూ.12,800 కోట్లతో జగనన్న ప్రభుత్వం దీనిని ఆధునీకరించారన్నారు.చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే కచ్చితంగా బాపు మ్యూజియానికి రావాలని మంత్రి అన్నారు.కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు వెళ్లే వాళ్లకి ఇక్కడ చరిత్రని చూపిస్తే చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.360 డిగ్రీ స్క్రీన్ రెడీ అవబోతుందని,  ఆదిమానవుల చరిత్రను తెలుసుకునే విధంగా దీన్ని రెడీ చేస్తున్నామన్నారు.స్కూల్ పిల్లలకు టూర్స్ పెట్టేలాగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో సంప్రదింపులు చేస్తానని మంత్రి రోజా వెల్లడించారు.

 .

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తాజా వార్తలు