రుణమాఫీ కేసీఆర్ కు బ్రహ్మాస్రమేనా?

వచ్చే ఎన్నికలలో గెలిచి తెలంగాణా లో హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతున్న కేసీఆర్( CM kcr ) శరవేగం గా పావులు కదుపుతున్నారు.

తన అమ్ములపొది లో ఉన్న అస్త్రాలు అన్నిటిని బయటకు తీసి ప్రత్యర్థులను చిత్తు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా అనేక వర్గాలను ఆకట్టుకునేలా వరాల జల్లు కురిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకతను మటుమాయం చేసే ప్రణాళికలను అమలు చేస్తున్నారు.ఇప్పటికే ఆర్టీసీ( TSRTC )ను ప్రభుత్వం లో విలీనం చేసి ఆ వర్గాల అభిమానం చూరగొన్న కేసీఆర్ తొందరలోనే కొత్త పిఆర్సి ఏర్పాటు, పాత పిఆర్సి బకాయిల చెల్లింపులతో ఉద్యోగ వర్గాలను కుషీ చేసే నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు అతిపెద్ద ఓటు బ్యాంకు అయిన రైతులపై దృష్టి పెట్టారు.

దాదాపు లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసే భారీ నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల రాష్ట్ర ఖజానాపై దాదాపు 27 వేల కోట్ల రూపాయల భారం పడుతు నప్పటికీ కేసీఆర్ వెనుకకు తగ్గటం లేదు.భూములు వేలం ద్వారా ,ఓఆర్ లీజుల ద్వారా, మద్యం టెండర్లు అప్లికేషన్ల ద్వారా ఇలా అన్ని రకాల ఆదాయాలు పోగు చేసి మరి రుణమాఫీ ( Loan waiver )చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధపడింది.ఇప్పటికే ఐదువేల కోట్ల రూపాయల రుణమాఫీ జరగగా మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మిగతా రుణాలు కూడా మాఫీ చేయాలని కృత నిశ్చయం తో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుంది .రాష్ట్ర ఖజానాను దివాలా తీయిస్తున్నారని తెలంగాణను అప్పుల కుప్ప చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రతి రైతు కుటుంబానికి ప్రత్యక్షంగా లక్ష రూపాయలు ప్రయోజనం కలిగించే ఈ పథకం కెసిఆర్ ప్రభుత్వానికి బ్రహ్మాస్త్రమేనని చెప్పక తప్పదు.

Advertisement

ఈ పథకం గనక పూర్తిస్థాయిలో అమలు అయితే మూడవసారి కేసీఆర్ తెలంగాణ గద్దెపై కూర్చోవటాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పొచ్చు.ఒకపక్క సిటింగ్ లందరికి తిరిగి టికెట్లు ఇస్తానని ప్రకటించడం, అతికొద్దీ నియోజకవర్గాలలో మాత్రమే రెబల్ అభ్యర్థుల బెడద బారోసా కు ఉండడంతో ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనతో అసంతృప్తితో ఉన్న వర్గాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు.ప్రస్తుతం కారు చూపిస్తున్న జోరు చూస్తుంటే ప్రతిపక్షాలకు అందనంత దూరంలో కేసీఆర్ ముందున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు