ఇవాళ 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల..: మురళీధరన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ 45 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు మురళీధరన్ అన్నారు.

వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

సీపీఎంకు రెండు, సీపీఐకి రెండు సీట్లు ఇస్తున్నామని మురళీధరన్ స్పష్టం చేశారు.ఈ మేరకు కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

ఏ స్థానాలు ఇవ్వాలన్న విషయంపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్న మురళీధరన్ ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుందని వెల్లడించారు.అదేవిధంగా మిగతా పదిహేను స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

కాగా ఇవాళ జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చించిన విషయం తెలిసిందే.

Advertisement
శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?

తాజా వార్తలు