'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ రికార్డ్ అందుకున్న ఏకైక మూవీ 'లియో'.. గ్రేట్ అంటూ..

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ ( Thalapathy Vijay )సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj )దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ కాంబోలో ఇంతకు మాస్టర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యిన విషయం విదితమే.

దీంతో ఈ కాంబోపై ఈసారి ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.విజయ్ దసరా బరిలో లియో సినిమాతో రాబోతున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేస్తున్నారు.లియో సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )విజయ్ కు జోడీగా నటిస్తుంది.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

దీంతో ఆడియెన్స్ అంత ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.మేకర్స్ కూడా ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హైప్ ను క్రియేట్ చేసి రిలీజ్ కూడా అదే స్థాయిలో చేయడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేసారు.మరి అందుతున్న సమాచారం ప్రకారం లియో సినిమా యూఎస్ లో భారీ రికార్డ్ ను క్రియేట్ చేసినట్టు అక్కడి డిస్టిబ్యూటర్స్ చెబుతున్నారు.

మన టాలీవుడ్ గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్( RRR movie )తర్వాత మళ్ళీ ఈ రికార్డును క్రియేట్ చేసిన ఏకైక మూవీ లియో( LEO ) నే అని చెబుతున్నారు.ఆ రికార్డ్ ఏంటంటే యూఎస్ లో కేవలం ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకున్న ఏకైక సినిమాగా లియో నిలిచినట్టు చెబుతున్నారు.ఇన్నేళ్ళలో లియో సినిమానే ఈ రికార్డ్ నెలకొల్పింది.

మరి రిలీజ్ తర్వాత ఇంకెంత రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు