33 మంది 'ఆ ఎన్నారై'...ల పాస్పోర్ట్ రద్దు..!

భార్యలని భారత్ లో వదిలేసి, విదేశాలు వెళిపోయి వారిని తమతో తీసుకెళ్ళకుండా మోసం చేస్తున్న ఘటనలని పరీక్షించి ఓ చట్టాన్ని ఇటీవల కేంద్రం రూపొందించింది.

ఈ చట్టానికి అనుగుణంగా ఎన్నారైల భార్యల నుంచీ వచ్చిన ఫిర్యాదులని పరిగణలోకి తీసుకుని, విచారణ చేపట్టి.

ఆ తరువాత నేరం రుజువైతే ఆ ఎన్నారై లపై వేటు వేయడానికి చట్టాలని రూపొందించింది.ఈ తరుణంలోనే ఈ చట్టం

రూపకల్పన చేసిన తరువాత కేంద్రానికి ఇలాంటి ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడ్డాయి.దాంతో విచారణ చేపట్టిన కేంద్రం భార్యలని వదిలి వెళ్ళిపోయినా దాదాపు 33 మంది ప్రవాసీయుల పాస్‌పోర్టులను రద్దు చేసింది.8 మందిపై ఇంటర్‌పోల్‌ ద్వారా విదేశాంగ మంత్రిత్వ శాఖ లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ను జారీ చేసింది.

ఈ వివరాలని తాజాగా మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి బుధవారం తెలిపారు.ఎన్నారైల వివాహాలను వారంలో నమోదు చేయించాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించిందని.పరారిలో ఉండే ఎన్నారైలని వదిలే ప్రసక్తి లేదని ఇలాంటి కేసులు ఇంకా వస్తున్నాయని ఆయన తెలిపారు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు