బిగ్ బాస్ లోకి మరో బ్యూటీ.. మాములు హాట్ అందాలు కాదుగా!

బుల్లితెరలో త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 గురించి ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తికాగా.

ఈ రియాలిటీ షోకు బుల్లితెర ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు.దీంతో చాలా గ్యాప్ తో సీజన్ 5 ఉంటుందన్న వార్తలు వినిపించడంతో ఇక ఈ సీజన్ గురించి ఎదురుచూస్తున్నారు అభిమానులు.

అంతేకాకుండా పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి కూడా ఎవరా అని ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఇందులోకి మరో బ్యూటీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సీజన్ లో సోషల్ మీడియా సెలబ్రెటీలు, యాంకర్ లు, వెండితెర, బుల్లితెర నటులు పాల్గొంటున్నారని టాక్ వినిపించింది.పైగా కొందరి పేర్లను కూడా సోషల్ మీడియాలో వదిలారు.

Advertisement
Bigg Boss-5, Lahari Shari, Telugu Bigg Boss,tollywood,latest News Social Media-

అలా అందులో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ బిగ్ బాస్ అభిమానులు మాత్రం ఈసారి మరింత ఆసక్తి చూపుతున్నారు.ఇక ఇందులో మరో హాట్ బ్యూటీ పేరు వినిపిస్తుంది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు యంగ్ హీరో తేజ నటించిన జాంబి రెడ్డి బ్యూటీ లహరి శారి.ఈ సినిమాలో నటించిన లహరికి తన పాత్రతో మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ఈమె త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి.మోడల్ గా, యాంకర్ గా మంచిపేరు సంపాదించుకుంది.

అంతే కాకుండా అర్జున్ రెడ్డితో పాటు పలు సినిమాలలో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ ఫోటోలతో యువతను బాగా రచ్చ చేస్తుంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

దీంతో ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అందాలతో ఎంత మందిని ఆకట్టుకుంటుందో చూడాలి.

Bigg Boss-5, Lahari Shari, Telugu Bigg Boss,tollywood,latest News Social Media
Advertisement

ఈసారి ఈ సీజన్ కు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారని తెలిసిందే.ఇక తాజాగా ఇందులో సోషల్ మీడియా సెలబ్రేటి షణ్ముఖ్ జస్వంత్ కోటి రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు హాట్ టాపిక్ గా మారింది.ఇదిలా ఉంటే ఈ షో వచ్చే నెల మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు