వివేకా కేసులో ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

ఏపీ సీఎం జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకనంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కూతురు సునీత డిమాండ్‌ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన విషయం తెల్సిందే.

సునీత పలు అనుమానాలను వ్యక్తం చేస్తుంది.

వైకాపా నాయకులు ఎంపీలకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన లాయర్‌ సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదు అంటూ వాదిస్తున్నాడు.

వివేకనంద రెడ్డి హత్యకేసు నిమిత్తం నియమించిన సిట్‌ ఇప్పటికే విచారణ పూర్తి చేసింది.దోషులను గుర్తించి చట్టం ముందు నిలిపే ఈ సమయంలో మళ్లీ సీబీఐ విచారణ అంటే మళ్లీ మొదటి నుండి చేయాల్సి వస్తుందని, అందుకే సీబీఐ విచారణ అవసరం లేదు అంటూ వైకాపా ప్రభుత్వం వాదిస్తుంది.

వైకాపా ప్రభుత్వం తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు వివేక హత్య కేసును ప్రభుత్వం పట్టించుకోకుండా సీబీఐకి అప్పగించకుండా అడ్డుకుంటుంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

అసలు ఈ కేసు విషయమై ప్రభుత్వంకు ఉన్న భయం ఏంటీ అంటున్నారు.

ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?
Advertisement

తాజా వార్తలు