2023లో విడుదల కాబోయే హ్యుందాయ్ కార్ల వివరాలు ఇవిగో!

కార్ల ప్రేమికులు ఎంతగానో ఇష్టపడేటువంటి హ్యుందాయ్ బ్రాండ్ మోటార్ ఇండియా లిమిటెడ్ రానున్న కొత్త సంవత్సరం (2023)లో కొత్త కార్లను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది.

ఇవన్నీ 2023లో జరిగే ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే అవకాశం కలదు.

ఈ 2023లో అప్డేటెడ్ ఇంజిన్ ఆప్సన్స్ తీసుకువచ్చే పనిలో పడింది.అవి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.ఇవి మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్సన్స్ అని నిపుణులు చెబుతున్నారు.

అదే సమయంలో ఈ కార్లలో అప్డేటెడ్ ఇంటీయర్ ఫీచర్స్ కూడా వినియోగదారులు పొందవచ్చు.ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఆరా.మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ మరియు టాటా టిగోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉందనే విషయం అందరికీ తెలిసినదే.కంపెనీ యొక్క గ్రాండ్ ఐ10 నియోస్ కూడా కొత్త వెర్షన్ రూపంలో అడుగుపెట్టనుంది.

అయితే ఈ కారు ప్రస్తుతం టెస్టింగ్ దశలో వుంది.ఇందులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, అప్డేటెడ్ బంపర్ వంటి వాటితో పాటు LED DRLలతో ఫ్రంట్ ఫాసియాను పొందుపరిచారు.ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి వుంది.మరియు ఇది 83 BHP పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

Latest Models Of Hyundai Cars To Be Releasing In 2023 Details, Hundai Cars, 2023
Advertisement
Latest Models Of Hyundai Cars To Be Releasing In 2023 Details, Hundai Cars, 2023

అలాగే హ్యుందాయ్ కంపెనీ టాటా పంచ్ మైక్రో SUVకి గట్టి పోటీని ఇవ్వడానికి ఒక మైక్రో SUV లాంచ్ చేయడానికి సిద్ధమౌతోంది.ఇది 5 సీట్లను కలిగి ఉండి, చూడటానికి గ్రాండ్ i10 నియోస్ మాదిరిగానే ఉంటుందని చెబుతున్నారు.దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ 2023 ఆరా, మైక్రో ఎస్‌యువి, 2023 గ్రాండ్ ఐ10 నియో వంటి వాటితో పాటు కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కారు ఐయోనిక్ 5 కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టమౌతోంది.

ఈ కారు కోసం బుకింగ్స్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.కాబట్టి ఔత్సాహికులు ఇప్పుడే తేరుకొని బుకింగ్స్ చేసుకోండి.

Advertisement

తాజా వార్తలు