మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించిన ధమాకా సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలా నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు రవితేజ చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు.గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా కోసం రవితేజ చాలా ఎక్కువ కష్టపడ్డాడు అంటూ ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు చెప్తున్నారు.
ఇక విడుదల సమయం లో కూడా రవితేజ ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమా కు కూడా చేయనంత ప్రమోషన్ చేశాడు.ఇదే సమయంలో రవితేజ ప్రమోషన్ కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్ లో ఒక ఇంటర్వ్యూ ఉందట.ఆ ఇంటర్వ్యూ ధమాకా సినిమా తో పాటు వారిద్దరు కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా గురించిన ముచ్చట్లతో సాగుతుందట.కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవ్వడంతో పాటు ముందు ముందు మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు వచ్చేలా ఉండబోతుంది అంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం వినిపిస్తోంది.చిరంజీవి బరిలోకి దిగితే కచ్చితంగా ధమాకా సినిమా యొక్క స్థాయి అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వాల్తేరు వీరయ్య సినిమాలో తనకోసం నటించిన రవితేజ సినిమా కనుక చిరంజీవి రంగంలోకి దిగి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చివరి దశ షూటింగ్ లో రవితేజ తో పాటు చిరంజీవి కూడా పాల్గొంటున్నారు.
అదే సమయంలో ఇద్దరు కలిసి ఒక 20 నిమిషాల ఇంటర్వ్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది, అతి త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.