Balakrishna KS Ravikumar : బాలయ్య పిలిచి కొడతాడు.. విగ్గు అటూఇటూ అయితే అలా చేశాడు.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో బాలయ్యతో కేఎస్ రవికుమార్( KS Ravikumar ) రెండు సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

జై సింహా,( Jai Simha ) రూలర్( Ruler ) టైటిల్స్ తో ఈ రెండు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.

అయితే తాజాగా గార్డియన్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ బాలయ్య( Balayya ) గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.షూటింగ్ సమయంలో తనను చూస్తూ ఎవరైనా నవ్వితే బాలయ్య అస్సలు తట్టుకోలేడని కేఎస్ రవికుమార్ అన్నారు.

ఒక మూవీ షూట్ సమయంలో నా అసిస్టెంట్ శరవణన్ ను ఫ్యాన్ తిప్పమని అడిగానని ఆ వ్యక్తి పొరపాటున ఫ్యాన్ బాలయ్య వైపు తిప్పాడని ఆ సమయంలో బాలయ్య విగ్గు( Balayya Wig ) అటూఇటు అయిందని ఆయన కామెంట్లు చేశారు.ఆ సమయంలో శరవణన్ కొంచెం నవ్వాడని కేఎస్ రవికుమార్ వెల్లడించారు.

శరవణన్ నవ్వడంతో బాలయ్యకు కోపం వచ్చేసిందని ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడని దర్శకుడు కామెంట్లు చేశారు.ఆ సమయంలో బాలయ్య ఎక్కడ కొడతాడో అని ఆ వ్యక్తి మన అసిస్టెంట్ డైరెక్టర్ అని నేను సర్ది చెప్పానని కేఎస్ రవికుమార్ పేర్కొన్నారు.నేను చెప్పినా బాలయ్య కూల్ కాలేదని ఆ సమయంలో అక్కడినుంచి వెళ్లిపోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ కు సూచించానని ఆయన కామెంట్లు చేశారు.

Advertisement

అప్పుడు బాలయ్య స్థిమితపడ్డాడని దర్శకుడు కామెంట్లు చేశారు.అయితే దర్శకుడి కామెంట్లపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.ఆఫర్లు లేని వ్యక్తికి బాలయ్య ఛాన్స్ ఇస్తే బాలయ్యపైనే విమర్శలు చేయడం ఎంతవరకు రైట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య ఫ్యాన్స్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు