టాలీవుడ్ లో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన యువ హీరో కృష్ణ బూరుగుల.. మామూలు క్రేజ్ కాదు

కృష్ణ బూరుగుల. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ హీరో పేరు వినిపిస్తుంది.

వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు.రవిబాబు తీసిన క్రష్ అనే సినిమా ద్వారా కృష్ణ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

సినిమా ఇండస్ట్రీకి రాకముందు కృష్ణ జీవితంలోనూ ఎన్నో వొడిదొడుకులు ఉన్నాయి ఎన్ని వందల ఆడిషన్స్ ఇచ్చినా కూడా సెలెక్ట్ అవలేదు అలాగే అనేక ఆడిషన్స్ ని తన యూట్యూబ్ ఛానల్ లోనూ వెబ్సైట్లోనూ అప్లోడ్ చేసుకుని సినిమా దర్శక నిర్మాతలకి పంపించి అలుపెరుగని పోరాటమే చేశాడు.ఇక తన శ్రమ ఫలితంగా మొట్టమొదటిగా రవిబాబు పిలిచి అవకాశం ఇచ్చాడు.

క్రష్ మూవీలో హీరోగా నటించిన కృష్ణ మొదటి సినిమా తోనే మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు ఆ తర్వాత మా నాన్న నక్సలైట్ అనే మరో సినిమాలోను నటుడిగా రాణించాడు ఈ సినిమా క్లైమాక్స్ లో కృష్ణలో నటుడుని, అతని తపనని మనం గమనించవచ్చు.ఈ సినిమాలో రఘుకుంచే మెయిన్ లీడ్ గా నటించగా సునీల్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

Advertisement

కృష్ణకి నటుడుగా ఇది రెండవ సినిమా.

ఇక తనకు మెరుగుపరచుకోవడానికి ఇప్పటికీ షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా శిక్షణ పొందుతున్నాడు కృష్ణ బూరుగుల.అంతేకాదు చిన్న చిన్న పాత్రలు, జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా నటించడం అనుభవం ఉంది.ఇక ప్రస్తుతం కృష్ణ, సత్యదేవ్ హీరోగా కొరటాల శివ తీస్తున్న కృష్ణమ్మ సినిమాలో నటిస్తున్నాడు.

ఇక దిల్ రాజు బ్యానర్ లో సైతం ఏటీఎం అనే మరో వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు కృష్ణ.

అర్జున్ రెడ్డి సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కృష్ణ బ్యానర్ లోను ఒక సినిమాకి అంగీకరించాడు కృష్ణ బూరుగుల.ఇదే కాకుండా మరికొన్ని చిత్రాలు కథా చర్చలు జరుగుతున్నాయి.ఇండస్ట్రీకి పరిచయం అయిన అనేకమంది నటులు స్టార్ హీరోస్ గా చలామణి అవుతున్నారు వారిలో అల్లరి నరేష్ విజయ్ దేవరకొండ స్టార్స్ ఉన్నారు వారి దారిలో కృష్ణ బూరుగుల కూడా స్టార్ హీరో అవ్వాలని కోరుకుందాం.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు