కోవిడ్ విలయతాండవం.. ఒక్కరోజే 64,553 మందికి !

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికి చాల మంది ప్రాణాలను కోల్పోయారు.

ఈ మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే దేశ ప్రజలను ఈ మహమ్మారి బారి నుండి కాపాడుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అంతేకాకుండా ఈ వైరస్ ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.ప్రజలు బయటికి వెళ్ళినపుడు మాస్కులు, సామజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అయితే గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 64,553 మంది ఈ వైర‌స్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించారు.అయితే గ‌డిచిన 24 గంట‌ల్లో 1,007 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలను కోల్పోయారు.

Advertisement

అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల 76 లక్షల 94 వేల కరోనా పరీక్షలు చేశారు.దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య‌ 24లక్షల 61వేల 191కి చేరుకుంది.

ఇప్పటి వరకు 17,51,555 మంది ఈ మహమ్మారి బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరుకున్నారు.దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040 మంది.

అయితే ప్ర‌స్తుతం దేశంలో 6,61,595 మంది ఈ మహమ్మారి కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు