Vijay Sethupathi : ఎలాంటి ఇగో లేని హీరోలు వీరు ముగ్గురే .. హీరోయిన్ కాళ్ళు పట్టడానికి కూడా రెడీ

హీరో అంటే ఎలా ఉండాలి.హీరోయిజం ఉన్న లేకపోయినా బాగా చూపించాలి.

ఎల్లప్పుడూ జపం చేసే బ్యాచు పక్కనే ఉండాలి.

హీరో ఏం చెప్తే అదే నడుస్తది.

అయన చెప్పిన నటిని హీరోయిన్ గా పెట్టాలి.ఆఖరికి రెమ్యునరేషన్స్ కూడా హీరోలే డిసైడ్ చేస్తారు, ఇదే ప్రెజెంట్ ట్రెండ్.

కానీ నాటి రోజుల్లో ఆలా ఉండేది కాదు హీరో అంటే కేవలం పారితోషకం తీసుకొని నటించి వెళ్లిపోయేవాడు.దర్శకుడికి, నిర్మాతకు చాల విలువ ఇచ్చేవారు.

Advertisement

తమకు పని ఇప్పించిన వ్యక్తులుగా గౌరవంగా చూసుకునే వారు.కానీ కాలం మారింది.

తాను మాత్రమే నటించడం వల్లనే సినిమాకు అంత లాభం వచ్చింది అనే భ్రమలో హీరో ఉండిపోతున్నాడు.

ఎందుకంటే హీరో కి మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు.ఆ ఫ్యాన్స్ కి ప్రసన్నం చేసుకోవడం కూడా దర్శకుడికి మరియు నిర్మాతకు చాల అవసరం.కానీ ఇది కొన్ని ఇండస్ట్రీ లకు మాత్రమే పరిమితం అయ్యింది.

ఫ్యాన్స్ ఉన్న, పరపతి ఉన్న దర్శకుడు ఏం చెప్తే అది చేసే హీరోలు చాల అరుదుగా ఉంటారు.మన టాలీవుడ్ లో మహేష్ బాబు( Mahesh Babu ) మాత్రమే తన పని తాను చేస్తాడు.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

ఏ విషయం లోను వేలు పెట్టాడు.ఆలా అని అందరూ మహేష్ లాగ ఉండాలని కాదు కానీ దర్శకుడు ఏం తీయాలని అనుకుంటున్నాడో అది తీయనిస్తేనే కదా అతడు క్రియేటివ్ గా సినిమా తీయగలడు.

Advertisement

అయితే కోలీవుడ్, మల్లు వుడ్ లలో ఇలాంటి హీరోలు చాల మందే ఉన్నారు.

అందులో ముఖ్యంగా చెప్పాల్సింది తమిళ్ లో ధనుష్, విజయ్ సేతుపతి, సూర్య( Dhanush, Vijay Sethupathi, Surya ).ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్స్ కాళ్ళు పట్టుకునే సీన్ ఉన్న కూడా చేసినవారే.ఇక మలయాళంలో మమ్మూట్టి వంటి వారు నేల మీద పడుకొని నిద్ర పోయిన రోజులు ఎన్నో ఉన్నాయ్.

అందుకే మిగతా భాషలతో పోలిస్తే మన భాషలో కేవలం హీరోలు మాత్రం ఉన్నారు.కానీ బయట నటులు ఉన్నారు.వారు దర్శకుడు ఏం చెప్తే అదే చేస్తారు.

సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారు.కేవలం ఆ సినిమా విజయవంతం కావడమే వారికి కావలి.

ఎలాంటి ఆడంబరాలు, ఆర్భాటాలు ఇష్టపడరు.

తాజా వార్తలు