లాక్ డౌన్ పాటించని జనాలు,పోలీసుల అరెస్ట్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి తో చాలా దేశాలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే.

భారత్ లో కూడా కరోనా తీవ్ర స్థాయిలో ప్రబలుతుండడం తో కేంద్రం కూడా లాక్ డౌన్ కు పిలుపునిచ్చింది.

ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి.మరి కొంత కాలం లాక్ డౌన్ ను పాటిస్తే కరోనాను అరికట్టవచ్చు అంటూ ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం తో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి.

Kolkata Police Arrest 255 People For Violating Restriction Orders, Kolkata Polic

అయితే కొంత మంది ఈ లాక్ డౌన్ ను పట్టించుకోకుండా రోడ్ల పై తిరుగుతూ అధికారులకు తలనొప్పులు తీసుకువస్తుండడం తో అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడడం ఎల్దు.తాజాగా కోల్ కతా లో ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లగించి రోడ్ల పైకి వచ్చిన 255 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఈనెల 31 వరకు లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని బయటకు తిరగొద్దని ఎంత చెబుతున్నా కొంతమంది వినిపించుకోవడంలేదు.పోలీసులు, అధికారులు హెచరికలు చేస్తున్నా పట్టించుకోవడంలేదు.

Advertisement

ఎలాంటి కారణం లేకుండానే చాలామంది రోడ్లపైకి వస్తుండడం తో పోలీసులు కఠినంగా వ్యవహరించక తప్పడంలేదు.ఈ క్రమంలోనే రోడ్ల పైకి వచ్చిన 255 మందిని ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం కోల్ కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 7 కరోనా కేసులు నమోదవ్వగా ఒకరు మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు