ఒక్క మగాడు :  నాని పదవికి జగన్ భరోసా ? 

ఒక్క మగాడు అంటూ జగన్ ను పొగుడుతూ తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని.

జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దానికి కౌంటర్ గా నాని గట్టిగానే జనసేన,  టీడీపీపై విమర్శలు చేశారు.దీంతో కొడాలి నాని ప్రాధాన్యం వైసీపీలో మరింతగా పెరిగిపోయింది.

త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.పూర్తిగా మంత్రిమండలిని ప్రక్షాళన చేసి ప్రస్తుతం ఉన్న మంత్రులందరినీ తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నట్లుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ప్రస్తుతం మంత్రులలో కొంతమంది జగన్ కు అత్యంత సన్నిహితులు ఉన్నారు.వైసీపీ ప్రభుత్వం పై ఎవరు విమర్శలు చేసినా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ తమ నోటికి పని చెబుతూ ఉంటారు.

Advertisement
Kodali Nani Will Continue As Minister Even If Jagan Completely Changes The Ap Ca

      అటువంటి వారిలో మంత్రి కొడాలి నాని ముందుంటారు.సామాజిక వర్గం దృష్ట్యా చూసినా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు,  ఆ సామాజిక వర్గం లోని వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల పైన విరుచుకుపడుతూ ఉంటారు.

దీంతో నాని మంత్రి పదవికి ఢోకా ఉండదని,  మంత్రి వర్గాన్ని జగన్ ప్రక్షాళన చేసినా, నాని విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కు స్ట్రాంగ్ గానే సవాల్ విసిరారు.

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడటంపై నాని స్పందించారు.     

Kodali Nani Will Continue As Minister Even If Jagan Completely Changes The Ap Ca

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ని ఢీ కొట్టగల మగాడు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా.టిడిపి, జనసేన కాంగ్రెస్, బిజెపి ఏ పార్టీ అయినా సరే జగన్ కు వ్యతిరేకంగా 165 సీట్లలో పోటీ చేయగల మగాడు ఎవడు ఈ రాష్ట్రంలో ? ఆయన ను ఢీ కొట్టగల మగాడు.రాజకీయ పార్టీ ఉంటే నేను రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోతా.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

టిడిపి 160 సీట్ల లో సింగిల్ గా పోటీచేసి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించింది చంద్రబాబు కోసం అంటూ నాని విమర్శలు చేశారు.

Advertisement

నాని వ్యాఖ్యలు అటు టిడిపి , జనసేన కు ఇబ్బందికరంగా మారాయి.ఈ విధంగా నాని ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ జగన్ కు చేదోడువాదోడుగా ఉంటూ వస్తుండడంతో నే ఆయన పదవికి ఎటువంటి డోకా ఉండదని, నాని అంటే జగన్ ప్రత్యేక అభిమానం చూపిస్తారని వైసీపీ లోని కీలక నాయకులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

" autoplay>

తాజా వార్తలు