ట్రంప్ నిర్ణయంపై..రక్షణ శాఖ అధికారి రాజీనామా..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలపై ప్రజలు, అధికారులు విసుగెత్తి పోతున్నారు రెండు నెలల కాలంలో దాదాపు చాలా మంది అధికారులు తమ విధుల నుంచీ తప్పుకున్నారు.

కొందరిని ట్రంప్ తప్పించారు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

అయితే ముఖ్యంగా అమెరికాకి అత్యంత కీలకంగా ఉన్న రక్షణ శాఖ విషయంలోనే దాదాపు ఇద్దరు కీలక అధికారులు రాజీనామాలు చేసిన విషయం అందరికి తెలిసిందే అయితే తాజాగా మరో కీలక అధికారి సైతం ఇప్పుడు ఆయన పదవి నుంచీ తప్పుకున్నారు.ట్రంప్ అనాలోచిత నిర్ణయం పట్ల నేను అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్లుగా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కెవిన్‌ స్వీని మీడియాకి తెలిపారు.

తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తిడి లేదని అన్నారు.సిరియాలోని యూఎస్‌ బలగాలకు రెండేండ్ల పాటు స్వీని నేతృత్వం వహించిన ఆయన ఈ దాడుల వ్యవహారంలో ఉగ్ర సంస్థలని మట్టుబెట్టడం లో ఆయన కీలకంగా వ్యవహరించారు.

అయితే సిరియా నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని రక్షణ శాఖకు గతవారం ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు.సిరియాపై అమెరికా సైన్యం విజయ కేతనం ఎగురవేసింది అందుకే ఈ నిర్ణయం అని ప్రకటించారు అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే యూఎస్‌ రక్షణమంత్రి జెమ్స్‌ మాట్టిస్‌ సహా పలువురు అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు