టీడీపీ ఇక్కడ గోదారేనా ...? ఎదురు ఈదాల్సిందేనా ...?

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది అంటే అది కేవలం గోదావరి జిల్లాల గొప్పదనమే అంటూ తరుచూ టీడీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు.టీడీపీకి కంచుకోటల్లా ఈ రెండు జిల్లాలు ఉన్నాయి.

 What About Tdp In Both Godavari Districts-TeluguStop.com

ఇక్కడ ఏ పార్టీ కి మెజార్టీ సీట్లు వస్తే… ఆ పార్టీనే అధికారంలోకి రావడం అనేది చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది.ఒకరకంగా చెప్పాలంటే… ప్రతి పార్టీ ఇక్కడ పట్టు పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటున్నాయి .

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ సర్వేలు టీడీపీకి కలవరం పుట్టిస్తున్నాయి.ముఖ్యంగా… టీడీపీ హవా ఉండదని ప్రధానంగా… వైసీపీ, జనసేన ఎక్కువ స్థానాలను గెలుచుకుంటున్నాయని చెబుతున్నాయి.దీనితో ఇప్పటికే టీడీపీ అధినేత ఈ జిల్లాల మీద ప్రత్యేక దృష్టి సారించి పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

కానీ టీడీపీ ఇప్పటికే ఈ జిల్లాల్లో అనేక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోంది.వాస్తవంగా చెప్పాలి అంటే…టీడీపీలో గ్రూపుల గొడవల కారణంగా ఆ పార్టీ ఈసారి ఇక్కడ దారుణంగా దెబ్బతినబోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ మద్దతుతో నరసాపురం లోక్ సభ – తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది.ఈసారి ఆ సీట్లలో కూడా టీడీపీనే పోటీ చేయనుంది.ఎంపీ సీట్లు రెండింటిలోనూ… రెండు పార్టీల తరఫునా కొత్త వ్యక్తులు తెరమీదకు రాబోతున్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లలో ఈ రెండు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై కొంత స్పష్టత కనిపిస్తోంది.

ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో జనసేన ఎఫెక్ట్ వైసీపీ , టీడీపీ పార్టీలకు గట్టిగా తగిలేలా కనిపిస్తోంది.ఈ రెండు జిల్లాల్లో పవన్ సామజికవర్గం వారు ఎక్కువగా ఉండడంతో… జనసేనకు ఆశించిన స్థాయిలో సీట్లు వస్తాయనే పవన్ నమ్మకం పెట్టుకున్నాడు.టీడీపీ అంతర్గతంగా చేయించిన సర్వేల్లోనూ….

పార్టీ, పరిస్థితి… సిట్టింగ్ ఎమ్యెల్యేల అవినీతి కారణంగా… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగినట్టు తేలడంతో మెజార్టీ సీట్లలో అభ్యర్థులను మార్చి కొత్త వారిని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.దీనిలో భాగంగానే… ఏ ఏ సీట్లలో బలంగా ఉన్నాము.

ఎక్కడెక్కడ అభ్యర్థులను మార్చాలి అనే విషయంలో బాబు ఇప్పటికే ఒక క్లారిటీ కి వచ్చేసాడు.ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, ఏలూరు.

గోపాలపురం, పోలవరం ఇలా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చబోతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube