Keerthy Suresh : ఎవరు ఏమనుకున్నా నాకేంటి అంటూ కాంట్రవర్సీ నుంచి తప్పుకుంటున్న కీర్తి

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్లు ఆచితూచి మాట్లాడాలి.లేకపోతే ఇండస్ట్రీలోని మగవారు వారిని తొక్కేస్తారు.

ఇక మీడియా సంస్థలు వారిని మరింత బజారుకు ఈడుస్తాయి.ఇక దర్శకులు కూడా అంతే ఒదిగి ఉండాలి.

అయితే అమిత్ శర్మ ఈ విషయాన్ని మరిచి తప్పు చేశాడు.ఈ డైరెక్టర్ ప్రస్తుతం అజయ్ దేవగణ్‌తో కలిసి "మైదాన్"( Maidaan Movie ) అనే సినిమా చేస్తున్నాడు.దీనిని ఏప్రిల్ 9న విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు.1952-1962 మధ్యకాలంలో ఫుట్‌బాల్ కోచ్‌గా కొనసాగిన సయ్యద్ అబ్దుల్ రహీం( Syed Abdul Rahim ) అలియాస్ రహీం భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వస్తోంది.

ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాతలలో బోనీకపూర్ ఒకరు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు అమిత్ శర్మ( Director Amit Sharma ) మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రహీం భార్య రునా పాత్రకు కీర్తి సురేష్‌ను( Keerthy Suresh ) తీసుకోవాలని అనుకున్నాం, స్క్రిప్టు రాసుకుంటున్న సమయంలో ఆమె కాస్త బబ్లీగా ఉంది.అలాంటి ఆమే రునా పాత్రకు సూట్ అవుతుందని కీర్తి సురేష్ ని తీసుకుందామని ప్లాన్ చేశాం.

Advertisement

ఇంతలోనే కీర్తి సురేష్ బక్కగా అయింది.అందువల్ల ఆమె స్థానంలో ప్రియమణిని( Priyamani ) తీసుకున్నాం.

’ అని వెల్లడించాడు.అయితే అతని మాటల్లో నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

సన్నగా అయిన తర్వాత కూడా కీర్తి సురేష్ ని ఈ మూవీ మేకర్ సంప్రదించినట్టు చాలానే వార్తలు వచ్చాయి.సో, ఈ దర్శకుడు చెప్పేదంతా అబద్ధం అని తేలిపోయింది.

వాస్తవానికి కీర్తిసురేష్‌ను "మైదాన్" సినిమాలో యాక్ట్ చేయమని నిర్మాత బోనీకపూర్( Producer Boney Kapoor ) అడిగాడు.స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ హీరో సినిమాలో నటిస్తే బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగే అవకాశం ఉందని కీర్తి ఓకే చెప్పింది.కానీ ఆ తర్వాత ఆమె తన మనసు మార్చుకుంది.

సినిమా బడ్జెట్ 600 కోట్లు తిరిగేదేమో 10 లక్షల కారు.. నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడుతున్న ఎన్టీయార్...

అజయ్ దేవగణ్‌( Ajay Devgan ) వయసు ప్రస్తుతం 54 ఏళ్ళు, కీర్తి సురేష్ ఏజ్ 31.ఈ గ్యాప్ ఉండటం వల్ల అతడితో నటిస్తే కెరీర్ దెబ్బ తింటుందని కీర్తి సురేష్ మూవీ చేయడానికి ఒప్పుకోలేదు.నిజానికి ప్రియమణి, కీర్తి సురేష్ ఫిజిక్స్ ఒకే లాగా ఉంటాయి.

Advertisement

కాకపోతే ప్రియమని ముఖం కాస్త ముదిరినట్లు ఉంటుంది ఆమె అజయ్ పక్కన కరెక్ట్ గా సూటవుతుంది.అందుకే ఆమెను తీసుకున్నారు కానీ డైరెక్టర్ బొద్దుగా ఉన్న కీర్తి సన్నగా అయ్యిందని అందుకే తీసుకోలేదు అని తలతిక్క కారణాలు చెప్పడం ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆగ్రహానికి కారణం అవుతుంది.

అయితే కీర్తి సురేష్ దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.సైలెంట్ గా ఉండటమే ఉత్తమమని ఆమె అనుకున్నట్లు ఉంది.

తాజా వార్తలు