కేసిఆర్ ఇమేజ్ డ్యామేజ్ ? దెబ్బకొట్టిన ఢిల్లీ టూర్ ?

తెలంగాణలోనే కాకుండా, దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు మంచి ఇమేజ్ ఉంది.

ఏ విషయం అయినా, సూటిగా సుత్తి లేకుండా చెప్పడమే కాకుండా , తాను అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్టుగా చేరుకోవడంలో కెసిఆర్ సిద్ధహస్తులు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి తెలంగాణలో టిఆర్ఎస్ కు ఎదురు లేకుండా చేసుకోవడమే కాకుండా, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను బలహీనం చేసే విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.ప్రస్తుతం బిజెపి తెలంగాణలో బలం పుంజుకుంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు, గ్రేటర్ లో రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించింది.అందుకే బీజేపీని టార్గెట్ చేసుకుంటూ, ఆ పార్టీకి తెలంగాణలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఆదరణ లేకుండా చేయాలనే అభిప్రాయంతో కొత్త కూటమిని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తూ వస్తున్నారు.

కేటీఆర్ కు తెలంగాణ సీఎం గా బాధ్యతలు అప్పగించి, జాతీయ స్థాయి రాజకీయాలలో యాక్టివ్ కావాలని చూశారు.దీంతో దేశవ్యాప్తంగా మరోసారి కేసీఆర్ పేరు మారుమోగింది.

Advertisement

ఎన్నికల ఫలితాల తరువాత కెసిఆర్ వ్యవహరించిన తీరు కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.

బిజెపిని ప్రధాన రాజకీయ శత్రువుగా చూడడమే కాకుండా, ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులపైనా విమర్శలు చేస్తూ వచ్చిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ అవడం వంటి వ్యవహారాలు పై అనేక విమర్శలు వస్తున్నాయి.తెలంగాణ లో నెలకొన్న వివిధ సమస్యలను ప్రస్తావించేందుకు ఢిల్లీ పర్యటన కు వెళ్లినట్టు గా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇది ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా వ్యవసాయ సంస్కరణలు బిల్లుకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు తెలంగాణలో కేసీఆర్ మద్దతు ఇచ్చారు.ఢిల్లీలోని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తు న్నా, కెసిఆర్ వారిని కలిసి సంఘీభావం తెలపడం వంటివి చేయలేదు.ఇదిలా ఉంటే కెసిఆర్  రాజకీయ శక్తిసామర్ధ్యాలను నమ్మి బిజెపికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబోయే కూటమిలో చేరుదామని చూసిన చాలా ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు కేసీఆర్ వైఖరి పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొన్నటివరకు బిజెపి అగ్రనాయకులు కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం, అంతే స్థాయిలో కేసీఆర్ వారిపై విమర్శలు చేయడం వంటివి జరిగిన క్రమంలోనే ఇప్పుడు కెసిఆర్ ఢిల్లీ పెద్దలతో భేటీ అవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మొత్తంగా చూస్తే కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న కారణాలు ఏవైనా కెసిఆర్, టిఆర్ఎస్ ఇమేజ్ అయితే బాగా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు