ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కు ఎంతో నమ్మకమైన , సన్నిహితమైన వ్యక్తి.మొదటి నుంచి కేసీఆర్ వ్యూహాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ వస్తున్నారు.
పార్టీలో ఏర్పడిన ఇబ్బందులు అన్నిటినీ పరిష్కరిస్తూ, ఎక్కడా అసంతృప్త పరిణామాలు చోటు చేసుకోకుండా చూసుకుంటూ కేసీఆర్ మనసెరిగిన నేతగా హరీష్ గుర్తింపు సంపాదించుకున్నారు.అసలు కేటీఆర్ టిఆర్ఎస్ లో యాక్టివ్ కాకముందు కేసీఆర్ తర్వాత హరీష్ మొత్తం వ్యవహారాలను చక్కబెట్టే వారు.
ఎప్పుడైతే కేటీఆర్ ప్రభావం టిఆర్ఎస్ పెరిగిందో ఆయన సీఎం అభ్యర్థిగా ప్రచారం మొదలైందో అప్పటి నుంచి హరీష్ కెసిఆర్ ను దూరం పెడుతూ వచ్చారు.పార్టీలో ఎన్నో అవమానాలను హరీష్ ఎదుర్కొన్నారు.
ఒక దశలో ఆయన బీజేపీ లోకి వెళ్తున్నారు అనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది.హరీష్ తో సన్నిహితంగా మెలిగే టిఆర్ఎస్ నేతలు అందరికీ కెసిఆర్ ప్రాధాన్యం తగ్గించడం వంటి కారణాలతో ఒక దశలో హరీష్ సైతం అనుమానాస్పదంగానే వ్యవహరించారు.
రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా కాలం పాటు హరీష్ కు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టడం వంటివి చర్చనీయాంశం అయ్యాయి.కెసిఆర్ కు హరీష్ పై ఎన్నో అనుమానాలు ఉన్నా , ట్రబుల్ షూటర్ గా ఆయన పార్టీకి చేసే మేలు కెసిఆర్ ప్రతి సందర్భంలోనూ గుర్తు పెట్టుకుంటున్నారు.
పార్టీకి ఇబ్బందులు ఏర్పడినా హరీష్ ఒక్కరే చక్కదిద్దగలరు అనే నమ్మకం కేసీఆర్ లో ఎక్కువగానే కనిపిస్తోంది.

అందుకే హరీష్ తో సన్నిహితంగా మెలిగే రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకి వెళ్లిన తర్వాత హుజురాబాద్ లో రాజకీయ పరిణామాలను చక్కదిద్దే బాధ్యతలను కెసిఆర్ హరీష్ కి అప్పగించారు.
ఆయన అయితేనే హుజురాబాద్ లో టిఆర్ఎస్ కు ఎదురు లేకుండా చేయగలరని ఇప్పటికీ కేసీఆర్ నమ్ముతున్నారు.అయినా హరీష్ కేసీఆర్ మధ్య దూరం పెరుగుతోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, కెసిఆర్ తన గురువు, మార్గదర్శి తండ్రి లాంటి వ్యక్తి అంటూ హరీష్ మాట్లాడి కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు.
హరీష్ పై ఎన్నో అనుమానాలు ఉన్నాా, కేసీఆర్ మాత్రం ఆయనను వదులుకునేందుకు సిద్ధంగా లేరనే విషయం అనేక సందర్భాల్లో రుజువు అవుతూ వస్తోంది.కాకపోతే ప్రాధాన్యత విషయంలోనే లెక్క తప్పుతోంది.