ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు.అంతకు ముందు అనేకమంది ఈ వ్యవహారంలో అరెస్టు కావడంతో, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కేసులో త్వరలో అరెస్టు అవుతారనే విషయం అందరికీ అర్థం అయ్యింది.
అందుకే ముందుగానే సిసోడియా అరెస్ట్ పై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తూ.విమర్శలు చేస్తోంది.
ఇదంతా బీజేపీ కుట్ర గా చెబుతోంది.ఇదిలా ఉంటే అసలు ఈ కేసులో కవిత అరెస్ట్ అయితే చోటుచేసుకునే పరిణామాల పై బీజేపీ కూడా లెక్కలు వేసుకుంటోంది.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం లో కవిత ను సీబీఐ అధికారులు విచారించారు.మరోసారి ఆమెను ఢిల్లీకి పిలిపించి విచారణ చేసి అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ బిజెపి నేతలను ఢిల్లీకి పిలిపించారట.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కవిత అరెస్ట్ అయితే తలెత్తే పరిణామాల గురించి చర్చిస్తున్నారట.ప్రస్తుతం మనీష్ సిసోడియా అరెస్టు ద్వారా, రాజకీయంగా బిజెపికి వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమి లేదని, కానీ కవితను అరెస్ట్ చేస్తే త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం బిజెపి స్పష్టంగా ఉంటుందనే చర్చ జరుగుతోందట.కవిత అరెస్టు అయితే దానిని సెంటిమెంట్ గా మార్చుకుని , తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ లబ్ధి పొందుతుందనే అంచనా వేస్తున్నారట.

కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీ గానే కాకుండా తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర నేతగా ఉండడం కేసీఆర్ కుమార్తె కావడం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ కవిత అరెస్టు అయిన బీజేపీపై ఆ ప్రభావం లేకుండా చేయాలంటే ఏం చేయాలనే విషయం పైన అమిత్ షా తో చర్చిస్తున్నారట.రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు పైన ఎంత మేరకు ఆ ప్రభావం ఉంటుంది ? శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందా లేదా అనే అంశాల పై అమిత్ షా తెలంగాణ బిజెపి నాయకులతో చర్చిస్తున్నారట.మరోవైపు బీఆర్ఎస్ కూడా కవిత అరెస్టు అయితే ఏం చేయాలి అనే దానిపైన ముందస్తుగా ప్లాన్ లు సిద్ధం చేసుకోవడంతో బీజేపీ కూడా అలెర్ట్ అవుతోంది.