అందుకే తారక్ ను పిలవలేదు... క్లారిటీ ఇచ్చిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్?

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ కార్యక్రమంలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ కార్యక్రమం ద్వారా రామ్ చరణ్ ఒక్కసారిగా ఫేమస్ అవ్వడంతో ఈయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది.

 That's Why Tarak Was Not Called Hollywood Critics Association Gave Clarity ,rrr-TeluguStop.com

ఈ అవార్డుల వేడుకలో భాగంగా రామ్ చరణ్ అవార్డు ప్రజెంటేటర్ గా ఆయన చేతుల మీదుగా అవార్డులు అందించారు.అదేవిధంగా ఈయన నటించిన RRR సినిమాకు ఏకంగా ఐదు అవార్డులు కూడా రావడం విశేషం.

Telugu Ram Charan Tej, Tarak-Movie

ఈ క్రమంలోనే ప్రస్తుతం అమెరికాలో ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి రామ్ చరణ్ ఎంతో ఫేమస్ అయ్యారు.ఈ క్రమంలోనే నందమూరి అభిమానులు మాత్రం ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.RRRసినిమాలో కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు ఎన్టీఆర్ కూడా నటించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అయితే రామ్ చరణ్ ను హైలెట్ చేయడం కోసమే ఎన్టీఆర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, ఇందులో మెగా ఫ్యామిలీ హస్తం చాలా ఉంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

Telugu Ram Charan Tej, Tarak-Movie

ఇలా తారక్ అభిమానులు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతుండడంతో చివరికి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఈ విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ ను తాము ఈ వేడుకకు ఆహ్వానించలేదని తెలియజేశారు.ఆయన ప్రస్తుతం ఇండియాలో తన కొత్త సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, మా నుంచి ఆయనకు అందాల్సిన అవార్డు అతి త్వరలోనే అందుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

నిజానికి ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా తారకరత్న మరణంతో ఇది కాస్త వాయిదా పడింది.ఈ కారణాల వల్లనే ఎన్టీఆర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube