లోకేష్ ప్లాన్స్.. అంతకు మించి ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన తరువాత పార్టీ వ్యవహారాలను నందమూరి బాలకృష్ణ మరియు, నారా లోకేష్ భుజాన వేసుకున్నారు.మొన్నటివరకు యువగళం పాదయాత్రతో బిజీగా గడిపిన లోకేష్.

 Tdp Nara Lokesh Political Plans 2024 Elections,nara Lokesh,tdp,2024 Elections,yc-TeluguStop.com

ప్రస్తుతం పాదయాత్ర కు బ్రేక్ ఇచ్చి పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించారు.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న టీడీపీకి అధినేత అరెస్ట్ కావడం తీవ్రంగా భాదించే విషయమే.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్( Nara Lokesh ) ఎలాంటి నిర్ణయాలు తీసుకొనున్నారు ? ఎలా ముందుకు వెళ్లబోతున్నారు అనే అంశాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.గత కొన్నాళ్లుగా రాజకీయాలకు పనికి రాడని విమర్శలు ఎదుర్కొంటున్న లోకేష్.

యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra )తో రాజకీయాల్లో పరిణితి సాధించారు.

Telugu Ap, Chandrababu, Lokesh, Pawan Kalyan-Politics

దాంతో ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో లోకేష్ తీసుకునే నిర్ణయాలపైనే అందరి దృష్టి నెలకొంది.ఒకవైపు తన తండ్రిని బయటకు తీసుకోచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు.పార్టీ తదుపరి వ్యూహరచనపై ఫోకస్ పెట్టారు లోకేష్.

తాజాగా పార్టీ నేతలతో జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.వైసీపీ అరాచక పాలనకు చెక్ పెట్టేందుకు జగన్ ను గద్దె దించేందుకు అన్నీ పార్టీలు కలిసి రావాలని టీడీపీతో కలిసొచ్చే ప్రతి పార్టీని ఆహ్వానిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తు( Janasena TDP Alliance ) అధికారికంగా ఖాయమైంది.

Telugu Ap, Chandrababu, Lokesh, Pawan Kalyan-Politics

అయినప్పటికి ఇతర పార్టీల దోస్తీ కూడా టీడీపీ( TDP ) కోరుకుంటున్నాట్లు లోకేష్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమౌతోంది.ఏపీలో వామపక్షాలు కూడా వైసీపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తమతో కలవాలని లోకేష్ హింట్ ఇస్తున్నారా అనే అభిప్రాయాలూ వ్యక్షం చేస్తున్నారు కొందరు విశ్లేషకులు.

అటు బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నవేళ.వామపక్షాలు కూడా ఈ కూటమితో కలిసి అడుగేస్తాయా అనేది ప్రశ్నార్థకమే.మొత్తానికి ఏ పార్టీతోనైనా టీడీపీ కలిసేందుకు సిద్దమే అని లోకేష్ చెప్పడంతో ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నప్పటికి అంతకు మించి అనేలా లోకేష్ వ్యూహాలు రచిస్తున్నాడనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube