జనసేనాని పవన్ కల్యాణ్ ట్రాప్‌లో వైసీపీ చిక్కుతోందా? ఆయన విసిరిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఉక్కి రి బిక్కిరి అవుతున్నారా? అంటే.ఔననే అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.ఇటీవల గుడివాడ నియోజ కవర్గంలో పర్యటించిన పవన్.
వైసీపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బోడి లంగాలు.
అం టూ.కామెంట్లు కుమ్మరించారు.వాస్తవానికి తన హవాను పెంచుకునేందుకు పవన్ వేసిన పాచికగా పరిశీ లకులు బావిస్తున్నారు.ఇప్పుడున్న పరిస్థితిలో పవన్‌కు రాష్ట్రంలో పెద్దగా ఏమీ హవా లేదు.పార్టీ తరఫున పదిమంది కూడా జెండా మోసేవారు లేరు.
ఇక, గత ఏడాది ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసినా.
ఒక్క చోట కూడా విజయం సాధించలేదు.ఇక, జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేను కూడా పవన్ నిలబెట్టుకోలేక పోయా రు.అంటే.ఈ పరిణామాలను గమనిస్తే.
ప్రజలే పవన్‌ను పట్టించుకోవడం లేదనే విషయం ఇంత స్పష్టం గా తెలుస్తోంది.నిజానికి గత ఏడాది ఎన్నికలకు ముందు పవన్‌కు ఓ రేంజ్ ఉండేది.

ఆయన ఎక్కడ ప్రసంగించినా.ప్రజలు టీవీల ముందు పోటెత్తారు.అనేక విషయాల్లో ప్రజలు ఆయనపై ఆశలు పెట్టుకున్నారు.ప్రత్యేకహోదా తెస్తాడని అనుకున్నారు.కానీ, తర్వాత పరిణామాల్లో పవన్ అన్ని విధాలా విఫలమయ్యారు.హోదా తేలేదు.
ప్యాకేజీని పాచిపోయి న లడ్డూ అంటూ.వ్యాఖ్యానించిన ఆయనే పోయి పోయి అదే పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీతో చెలిమి చేశారు దీంతో ప్రజలు పవన్‌ను పట్టించుకోవడం మానేశారు.
అంతేకాదు.జనసేనలోనే చాలా మంది నాయకులు పవన్‌ను లెక్కచేయడం లేదు.
మరి అటు ప్రజలు, ఇటు సొంత పార్టీ నేతలు కూడా లెక్కించని పవన్‌ను అధికార పార్టీ నాయకులు మాత్రం పెద్దగా ఊహించుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ చేసే విమర్శలకు జవాబివ్వడం.
ఒకరు కాదు.ఏకంగా ముగ్గురు మంత్రులు స్పందించడం చూస్తే.
పవన్ ట్రాప్‌లో మంత్రులు చిక్కుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.