2023 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ అధికారం సాధించడంతోపాటు, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పార్లమెంట్ స్థానాలను దక్కించుకుని తన సత్తా ఏంటో చాటుకోవాలని చూస్తున్నారు టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఆయన ఈనెల 5వ తేదీన జాతీయ పార్టీ పేరును ప్రకటించబోతున్నారు.
అంతకుముందే టిఆర్ఎస్ ను ఆ జాతీయ పార్టీలో విలీనం చేయబోతున్నట్లుగా తీర్మానం చేయబోతున్నారు.పార్టీ ప్రకటించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలి ? ఏ ఏ రాష్ట్రాల్లో పోటీ చేయాలనే విషయంపై ముందుగానే కెసిఆర్ ఒక క్లారిటీతో ఉన్నారు.అందుకే తమకు సరిహద్దు రాష్ట్రాల్లో జాతీయ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపితే ఫలితం సానుకూలంగా ఉంటుందనే విషయంపై కేసీఆర్ దృష్టి పెట్టారు.
అందుకే నాలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.
తాజాగా జరిగిన పార్టీ నేతల సమావేశంలో పక్క రాష్ట్రాల్లో పోటీ చేసే అంశంపై కెసిఆర్ చర్చించారు.ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక , ఏపీ తెలంగాణ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు.
ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా సీట్లు ఉన్నాయని , వీటిలో 50,60 స్థానాల్లో తప్పకుండా గెలుస్తామనే ధీమా తో కేసిఆర్ ఉన్నారు.ముఖ్యంగా మహారాష్ట్రలోని మరాట్ వాడ , కర్ణాటకలోని తెలుగు ప్రాంతాలు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో టిఆర్ఎస్ కి ఆదరణ ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.
అలాగే తెలంగాణతో పాటు ఏపీలో విలీనమైన తెలంగాణలోని ప్రాంతాల్లోనూ తమ పార్టీకి ఆదరణ ఉంటుందని, ఇప్పటికే వారంతా తమను తెలంగాణలో కలపాలంటూ డిమాండ్ చేస్తున్న క్రమంలో ఏపీలోనూ తమకు ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కుతాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు .అయితే ఇక్కడ కేసిఆర్ కు సన్నిహితుడుగా ఉన్న ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనేది తెలియాల్సి ఉంది.మొదటి నుంచి జగన్ కు మద్దతుగా కేసీఆర్ నిలబడుతూ వచ్చారు.అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా, ఆయన వెంట నడిచేందుకు జగన్ అంతగా ఆసక్తి చూపించకపోవడం, ఇటీవల టిఆర్ఎస్ మంత్రులు హరీష్ రావుతోపాటు మరి కొంతమంది ఏపీ ప్రభుత్వం పరిపాలనపై విమర్శలు చేయడం, దానికి కౌంటర్ గా వైసీపీ నుంచి ప్రతి విమర్శలు జరిగాయి.
అంతేకాకుండా తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ఏ ఫ్రెంట్ లోను తాము చేరమని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.అయినా ఏపీతోbపాటు కర్ణాటక , మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై కేసీఆర్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు.