బీజేపీ పై కేసీఆర్ ఇలా డిసైడ్ అయ్యారా ?

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఇప్పుడు బీజేపీ భయం ఎక్కువ అయినట్టుగా కనిపిస్తోంది.

తెలంగాణలో ఉనికే లేదు అనుకున్న బిజెపి ఇప్పుడు తమకే సవాల్ విసిరే స్థాయికి వెళ్లడం, దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికలలో విజయం సాధించడం ఇవన్నీ టిఆర్ఎస్ కు కంగారు పుట్టిస్తున్నాయి.

అందుకే బీజేపీ విషయంలో దూకుడుగా ఉండాలని , కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న పథకాలలోని లోపాలను ఎత్తి చూపుతూ తెలంగాణలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.కేవలం బిజెపి విమర్శలతో సరి పెట్టడం వల్ల లాభం లేదని ,ప్రజలలో బీజేపీ పై వ్యతిరేకత పెరిగే విధంగా తాము చేయగలిగితేనే సక్సెస్ అవుతామనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

ఇప్పటికే కేంద్రం యాసంగి లో ధాన్యం కొనేది లేదు అని చెప్పడంతో దీనిపై ఇప్పటికే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం పైన జనాలలో చర్చ జరిగేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

టిఆర్ఎస్ పూర్తిగా రైతుల  తరుపున నిలబడి, టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా నిలుస్తోందనే సంకేతం పంపించేందుకు సిద్ధమవుతోంది.  ఈ నేపథ్యంలోనే నేడు శాసన సభాపక్ష  సమావేశాన్ని కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో నిర్వహించబోతున్నారు.

Advertisement

ఇక రైతు అంశాలనే హైలెట్ చేసుకోవడం ద్వారా,  కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇరుకున పడుతుంది అని, తమకు మేలు జరుగుతుంది అని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

ఇక టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ కూడా ఇదే విధమైన ఎత్తుగడ వేసింది.తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలను తెలుసుకునే విధంగా రంగంలోకి దిగారు.బీజేపీ శ్రేణులు తెలంగాణలో ఎక్కడ ఆందోళనల పేరుతో హడావుడి చేసినా, అడ్డుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

దీంతో అన్ని విషయాల్లోనూ కేంద్రాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలను  రచిస్తున్నారు.ఇక పూర్తిగా కాంగ్రెస్ విషయాన్ని పక్కన పెట్టి బీజేపీ తోనే యుద్ధం అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారం ఉంది.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు