ఇప్పుడే మేల్కొన్న టి. టీడీపీ ! హడావుడి గా బస్సు యాత్ర 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెద్దగా ఉనికిలో లేకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని గంభీరంగా ప్రకటనలు చేస్తూ వచ్చింది.

దీనికి తగ్గట్లుగానే ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్థికంగా స్థితి మంతుడైన కాసాని జ్ఞానేశ్వర్ న నియమించి కొంతకాలం పాటు హడావుడి చేసింది.

ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది .మరోవైపు చూస్తే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది.ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్,  బిజెపి, కాంగ్రెస్లు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నం అవడంతోపాటు, ప్రజలకు దగ్గర అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

అలాగే పెద్ద ఎత్తున తమ పార్టీలోకి చేరికలు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

 తెలంగాణ టిడిపి( Telangana TDP ) సైతం వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నా, ఆ దిశగా  ఇప్పటి వరకు పెద్దగా కసిరత్తు చేయలేదు.క్షేత్రస్థాయిలో టిడిపి బలపడే విధంగా పెద్దగా కార్యక్రమాలు ఏమి చేపట్టలేదు.కానీ ఇప్పుడు హడావుడిగా బస్సు యాత్ర చేపట్టాలని తెలంగాణ టిడిపి నిర్ణయించింది.

Advertisement

ఈ మేరకు బస్సు యాత్ర నిర్వహణకు టిడిపి తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేయబోతుంది.రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar )రాష్ట్ర కమిటీ , పోలిట్ బ్యూరో సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు.

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.దీనికోసం ఈనెల 28, 29లో వర్క్ షాప్ నిర్వహించి రూట్ మ్యాప్ ను నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తామని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.

 ప్రజా సమస్యల తో పాటు,  ప్రధానంగా ఆరు అంశాలపై చర్చిస్తామని , రాబోయే మూడు నెలల్లో పార్టీ చేసే కార్యక్రమాల క్యాలెండర్ ను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.ఈ యాత్రలో ప్రధానంగా తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం( CM KCR ) వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా కరపత్రాల రూపంలో ముద్రించి ప్రచారం చేస్తామని తెలంగాణలో టిడిపి అధికారంలోకి వస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందనేది ప్రజలకు వివరించి వారి మద్దతు కూడగడతామని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు