కార్తీ 'సర్దార్' సినిమా మోషన్ పోస్టర్ విడుదల.. లుక్ అదిరిపోయిందిగా..!

తమిళంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తీ ఒకరు.ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.

ఆవారా సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ అందుకున్నాడు.ఈ సినిమా ఇక్కడ మంచి హిట్ సాధించి భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది.

తర్వాత ఊపిరి సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేసాడు కార్తీ.ఈయన నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉంటారు.

సినిమా హిట్ అయితే ఇక్కడ కూడా మంచి వసూళ్లు రాబడతాడు కార్తీ.ఈ మధ్యే సుల్తాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

ఈ సినిమాలో కార్తీ సరసన హీరోయిన్ రష్మిక మందన్న నటించింది.వీరిద్దరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాగానే వసూళ్లు సాధించింది.అయితే ఈ సినిమా తర్వాత కార్తీ మరొక సినిమాను అనౌన్స్ చేసాడు.

ఎప్పుడూ విభిన్నమైన కథలతో ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తాడు కార్తీ.ఈ సారి కూడా కార్తీ ఒక విభిన్న కథతో రాబోతున్నట్టు తెలుస్తుంది.

తాజాగా కార్తీ ఒక కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు.ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఇది కొత్త స్టోరీ లైన్ తో రాబోతుందని అర్ధం అవుతుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

కార్తీ లుక్ కూడా పూర్తిగా చేంజ్ అయ్యి కొత్తగా కనిపిస్తున్నాడు.ఈ సినిమా పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

Advertisement

ఈ సినిమా టైటిల్ ను సర్దార్ అని పోస్టర్ లో తెలిపారు.ఇప్పుడు దీనికి సంభందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ పోస్టర్ లో కార్తీ ఇంట్రెస్టింగ్ గా కనిపించదు.అంతేకాదు ఇంతకు ముందు ఎప్పుడు చేయని పాత్ర లాగా అనిపిస్తుంది.

ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.ప్రిన్స్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి చూడాలి ఈ డిఫరెంట్ లుక్ తో కార్తీ ఏ మేరకు మెప్పిస్తాడో.

తాజా వార్తలు