కర్ణాటకా పలితాలు మోడీ చరిష్మా కు గీటురాయిగా మారనున్నాయా?

దేశవ్యాప్తంగా మోడీ మ్యాజిక్ నే ప్రధాన ప్రచారాస్త్రంగా భారతీయ జనతా పార్టీ( BJP ) ఎన్నికలకు వెళ్తుంది.

కరోనా కట్టడి ,పాకిస్తాన్ కు దీటుగా సమాధానం చెప్పడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడే నాయకత్వ పటిమ చూపుతున్నారని విదేశీ మీడియా కదనాలు ప్రచారం చేయడం ఇలా అనేక అంశాలలో తమ నాయకుడు దేశవ్యాప్తంగా ఆదరణ కలిగి ఉన్నారని భాజపా పార్టీ నమ్ముతుంది .

అందువల్ల కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా చెప్పకుండా చాలా రాష్ట్రాలలో ఆ పార్టీ పోటీ చేస్తుంది.ఇప్పుడు కర్ణాటక ఎన్నికలలో( Karnataka Elections ) అదే సీన్ రిపీట్ అయ్యింది .ఇక్కడ కూడా మోడీ మానియా పనిచేస్తుందని ఆ పార్టీ భావిస్తుంది అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా 26 ఎన్నికల ర్యాలీల లో మోదీ పాల్గొన్నారు.

ఇవి గాక అనేక రోడ్డు షోలు.బహిరంగ సభలో పాల్గొని తమ ప్రభుత్వం యొక్క ఘనతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.కేంద్ర మంత్రులను, భాజాపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను పీఠాధిపతులను ఇలా తమ కలిసి వచ్చే అన్ని వనరులను కర్ణాటకలో భాజపా ప్రయోగించింది.

లింగాయత్ ల ఓట్లను భాజాపావైపు ఆకర్షించి దశాబ్దాలు పాటు భాజాపాకు అధికారం సంపాదించి పెట్టిన యడ్యూరప్పను దూరం చేసుకోవటం భాజపా చేసిన వ్యూహాత్మకమైన పొరపాటు అన్న విశ్లేషణలు ఉన్నప్పటికీ మోడీ ( PM Modi ) మానియా ముందు అవేమీ అవసరం లేదని, మోడీ మ్యాజిక్ తోనే కర్ణాటకను గెలుస్తామని భాజపా శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఒక సంవత్సరమే సమయం ఉన్నందున కర్ణాటక ఎన్నికల ఫలితాలు మోడీ మానియా కి గీటురాయిగా నిలబడతాయని విశ్లేషణలు వస్తున్నాయి.కర్ణాటకలో భాజపా గెలిస్తే మోడీ చరిష్మా తగ్గలేదని నిరూపణ అవుతుంది.దాంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ముందుకు దూసుకెళ్తాయి .అలా కాకుండా కాంగ్రెస్ పుంజుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో హోరాహోరీ పోరు తప్పదు .ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా పక్కనపెట్టి తనకు తాను పరీక్ష పెట్టుకున్న మోదీ ఆ పరీక్ష లో పాసవుతారో లేదో మే 13 వ తారీకు తో క్లారిటీ వస్తుంది.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు