జనసేనకు మరో కీలక నేత గుడ్ బై

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం స్థాపించిన పార్టీ జనసేన.

అయితే ఈ పార్టీకి సంబంధించి మరో కీలక నేత గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.

ఇటీవలే ఈ పార్టీ నేత మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కి గుడ్ బై చెబుతున్నట్లు జనసేన అధినేతకు లేఖ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.మీరు ఎన్నికల సమయంలో తిరిగి సినిమాల్లో నటించాను అని చెప్పారు,కానీ ఇప్పడు వరుసగా సినిమాలు చేస్తున్నారు అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నాను అంటూ లేఖలో పొందుపరిచారు.

అయితే ఇంకా ఆ అంశం నుంచి బయటపడకుండానే జనసేన కు మరో కీలక నేత గుడ్ బై చెప్పడం విశేషం.జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితులు గాజువాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం కనకారావు ఆ పార్టీని వీడారు.2019ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఒకటి గాజువాక.పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సొంత నియోజకవర్గంలో కీలక నేత అయిన కరణం కనకారావు ఆ పార్టీకి రాజీనామా చెయ్యడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

ఒకవైపు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా.సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడడం ఆ పార్టీని కాస్త ఇబ్బందుల్లోకి నెట్టడమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement

కనకారావు పార్టీ కి గుడ్ బై చెప్పి వైసీపీ పార్టీ లో చేరినట్లు తెలుస్తుంది.ఆయనతో పాటు 200 మంది కార్యకర్తల తో కలిసి వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరినట్లు తెలుస్తుంది.

ఇటీవల జేడీ రాజీనామా తరువాత పవన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఎవరైనా పార్టీని వీడాలి అనుకుంటే వీడివెళ్లొచ్చు.నేను ఏమీ మీకు తాయిలాలు పెట్టలేను నాతో కలిసి పోరాడాలి అనుకొనే వారు మాత్రమే పార్టీ లో కొనసాగొచ్చు అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు