Aakashawani Movie: కాంతార తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కిన తెలుగు మూవీ డిజాస్టర్.. కథేంటంటే?

కొన్ని సినిమాలు చిన్న సినిమాలే అయినా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తాయి.

నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తాయి.

అలాంటి సినిమాలలో కాంతార ఒకటి.అయితే కాంతార తరహా సినిమా తెలుగులో రాలేదా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది.

రాజమౌళి శిష్యుడు ఆకాశవాణి పేరుతో కాంతార తరహా మూవీని తెరకెక్కించగా ఈ సినిమా గురించి ప్రేక్షకుల మధ్య చర్చ జరుగుతోంది.గతేడాది సెప్టెంబర్ నెల 24వ తేదీన ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది.

ఆకాశవాణి కథ విషయానికి వస్తే ఒక అటవీ ప్రాంతం నాగరిక ప్రపంచానికి దూరంగా ఉంటుంది.అక్కడ దొర ఏం చెబితే ఆ మాటలనే ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు.

Advertisement

చెట్టుతొర్రలో ఒక బండరాయి ఉండగా ఆ బండరాయిని ప్రజలు దైవంగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు.దొరే భవిష్యత్తు తరాలను శాసిస్తాడని ప్రజలు నమ్ముతారు.

ఎవరైనా గూడేం వదిలి వెళితే ప్రాణాలు పోతాయని గూడెం ప్రజలు బలంగా నమ్ముతారు.ఆ ఊరిలోకి బయటినుంచి వచ్చిన వాళ్లను దొర చంపేస్తూ ఉంటాడు.

అలాంటి ప్రజల జీవితాలలోకి రేడియో రూపంలో దేవుడు వస్తాడు.దేవుడు రేడియో రూపంలో వచ్చి ప్రజల జీవితాలను ఏ విధంగా మార్చాడు.దొర అరాచకత్వం ఏ విధంగా బయటపడిందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది.

రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ సినిమాను తెరకెక్కించగా స్టార్ క్యాస్ట్ లేకపోవడం, తక్కువ సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ఉన్న సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ కావడం ఆకాశవాణికి మైనస్ అయింది.ఓటీటీలో మంచి సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

థియేటర్లలో విడుదలై ఉంటే ఆకాశవాణి మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యే ఛాన్స్ అయితే ఉండేది.

Advertisement

తాజా వార్తలు