కేజీఎఫ్‌ 2 కోసం యశ్‌ ఆ సాహసం చేయడం లేదట

కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ కేజీఎఫ్ కు సీక్వెల్‌ గా రూపొందిన కేజీఎఫ్‌ 2 ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ మే నెలలో ముగిసినట్లయితే సినిమా ను అనుకున్నట్లుగా అనుకున్న తేదీకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

కాని ఇటీవల ఈ సినిమా విడుదల తేదీ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సినిమా విడుదల వాయిదా వేస్తారని కొందరు అంటున్నారు.

కాని అసలు విషయం ఏంటీ అనేది ఇంకా తెలియరాలేదు.ఇక ఈ సినిమా హిందీ మరియు తెలుగు వర్షన్‌ లకు యశ్‌ స్వయంగా డబ్బింగ్‌ చెప్పబోతున్నాడు అనేది వార్త.

ఈ వార్త పై గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. యశ్‌ డబ్బింగ్‌ చెప్తే ఎలా ఉంటుందని కొందరు చర్చంచుకుంటున్నారు.

Advertisement

యశ్‌ డబ్బింగ్‌ చెప్పడం వల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో యశ్‌ ఆలోచించాలని అంటున్నారు.

ఈ సమయంలోనే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి స్పందన వచ్చింది.ఇప్పటి వరకు డబ్బింగ్‌ విషయమై చర్చకు రాలేదు.

అయినా కేజీఎఫ్‌ కు ఎవరైతే డబ్బింగ్ చెప్పారో ఇప్పుడు కూడా వారే చెప్తారు తప్ప ఎందుకు కొత్త ప్రయోగం చేస్తారని కొందరు అంటున్నారు. కేజీఎఫ్‌ 2 లో యశ్‌ పాత్ర మరింత పవర్‌ ఫుల్‌ గా ఉంటుంది.

కనుక సినిమా పై అంచనాలు మరింత పెంచేలా మేకర్స్‌ ఆ పాత్రను డిజైన్ చేశారు.అలాంటప్పుడు ఎందుకు డబ్బింగ్‌ ను సొంతం గా చెప్పించి ప్రయోగం చేసి తప్పు చేస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

మొత్తానికి కేజీఎఫ్‌ 2 నుండి మీడియాలో జరుగుతున్న పుకార్లు అన్ని కూడా నిజం కాదని తేలిపోయింది.విడుదల తేదీ వాయిదా పడ్డ విషయం కూడా నిజం కాక పోవచ్చు అంటున్నారు.

Advertisement

త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు