Dr. Raj Kumar: ఇండియాలోనే రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలో నటించిన ఏకైక నటుడు ఇతనే ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లెజెండ్ నటుడు ఎవరు అంటే అందరికి టక్కున గుర్తచ్చే పేరు ఎన్టీఆర్.

పౌరాణికాలు అయన పోషించిన విధంగా మారె నటుడు కూడా చేయలేదు.

ఒకే సినిమాలో ఎక్కువ పాత్రల్లో నటించిన ఘనత కూడా ఆయనకే దక్కింది.కేవలం నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్టీఆర్ అన్ని విభాగాల్లోనూ సక్సెస్ అయ్యారు.

అయితే ఎన్టీఆర్( NTR ) కేవలం తెలుగు వారికి మాత్రమే యుగపురుషుడు.ఆయన లాగ తెలుగులో మరెవ్వరు మెప్పించలేరు కానీ పక్క భాషల్లోకి వెళ్తే ఒక్కో రాష్టానికి ఒక్కో యుగపురుషుడు మరియు లెజెండరీ నటుడు ఉంటారు.

అలాగే కన్నడ రాష్ట్రానికి గొప్ప నటుడు అంటే అందరు ముక్త కంఠంతో చెప్పే పేరు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్( Kannada Kanteerava Raj Kumar ) అని.

Advertisement

ఆయన ఎన్టీఆర్ కి సమకాలికులు మాత్రమే కాదు గొప్ప గాయకుడూ మరియు ఎన్టీఆర్ తో దీటుగా నటించగల సత్త ఉన్న నటుడు.ఇక రాజ్ కుమార్ ఎన్టీఆర్ సైతం చేయలేని ఒక అద్భుతమైన ఫీట్ ని సాధించారు.అది ఏంటంటే, రాముడిగా, రావణుడిగా మరియు హనుమంతుడిగా కూడా నటించి ఇండియా లోనే ఏ నటుడు కూడా చేయలేని పని చేసి చూపించాడు.

రాముడిగా( Sri Rama ) సౌమ్యుడిగా నటించడం, రావణుడిగా( Ravana ) భీకరంగా నటించడం వరకు ఎన్టీఆర్ చేసారు.కానీ హనుమంతుడిగా,( Hanuman ) పరమ భక్తుడిగా ఎన్టీఆర్ నటించలేదు.

కానీ రాజ్ కుమార్ కి మాత్రమే అది సాధ్యం అయ్యింది.

ఇక రాజ్ కుమార్ గొప్పతనం గురించి చెప్పాలంటే ముందు అయన పేరు ముందు ఉన్న బిరుదుల గురించి చూపే సరిపోతుంది.కన్నడ వారు ముద్దుగా కంఠీరవ అని పిలుచుకుంటారు.ఆయనకు పద్మ భూషణ్ తో దాదా సాహెబ్ పాల్కే అవార్డు కూడా దక్కింది.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

ఇక అయన వారసులు అంత కూడా సినిమా ఇండస్ట్రీ వారే.శివ రాజ్ కుమార్ మరియు అప్పు మనకు బాగా తెలిసిన నటులు.

Advertisement

ఇందులో అప్పు అలియాస్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అతి చిన్న వయసులోనే గుండె పోటుతో మరణించడం తో అయన అభిమానులు అంత శోక సంద్రంలో మునిగి పోయారు.

తాజా వార్తలు