ఇప్పుడు కన్నడ, రేపు బాలీవుడ్, ఎల్లుండి అమెరికా ...కమల్ హాసన్ స్ట్రాటజీ ఏంటి ?

ఇంతకు ముందు ఆర్టికల్స్ లో కమల్ హాసన్ కాంతారా సినిమా పై మాట్లాడుతూ తాను కన్నడ వాడినే అని చెప్పడం గురించి తెలుసుకున్నాం.

అయితే కమల్ హాసన్ ఇలా కన్నడ పరిశ్రమను ఓన్ చేసుకోవడం లేదంటే కన్నడిగుడిగా ఉండాలనుకోవడం ఇదేమి మొదటి సారి కాదు.

సందర్భం వచ్చిన ప్రతి సారి తనలోని కన్నడత్వానికి అవకాశం ఇచ్చాడు.తాను కన్నడిగా ని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు.

పోనీ తానేమైనా కన్నడ ఇండస్ట్రీ ని ఉద్దరించాడా అంటే అదేమీ లేదు.కొన్నాళ్ల క్రితం చెన్నై లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సెంటినరీ కి సంబంధించి ఒక సెరిమని జరిగింది.

అందులో కమల్ హాసన్ మాట్లాడుతూ నేను ఒక కన్నడ వాడిని అనేశాడు.ఆ తర్వాత తమిళ వాళ్లు జుట్టు పీక్కోవడం ఒకటే తక్కువ అయ్యింది.

Advertisement

ఆ సెరిమనిలో లో మాట్లాడుతూ తాను కన్నడ మనిషిలా ఉండాలనుకుంటున్నాని, ఎక్కడ ఎవరు ఏం చేసిన కన్నడ కి చెందిన విషయం అయితే తనను పిలవాలని .హంబగ్, అబ్సర్డ్, కన్నడ చిత్ర పరిశ్రమ సెలబ్రేషన్స్ ఏం జరిగిన తనను పిలవండి అంటూ చెప్పాడు.నన్ను మీ వాడిగా గుర్తించండి అంటూ చెప్పుకున్నాడు.

అయితే ఈ ప్రసంగం తర్వాత కన్నడ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు.అయితే కమల్ హాసన్ సిద్ధాంతాలు, నమ్మకాలూ, విశ్వాసాలు, వ్యక్తి గత జీవితం అంత కూడా ఒక ప్రయోగమే.

అందులో ఈ కన్నడిగుడు అని చెప్పుకోవడం కూడా ఒక భాగమే.అయితే ఇక్కడైతే ఆగి తమిళ్ వాడు కాస్త కన్నడ వాడు అయితే ఎలాంటి సమస్య లేదు.

రేపు ఎక్కడైనా హిందీ చిత్రాలకు సంబందించిన ఏదైనా ప్రస్తావన వస్తే నేను బాలీవుడ్ వాడిని అంటూ ఎక్కడ చెప్పుకుంటాడో అని అందరి బాధ.ఇక ఆ తర్వాత దశావతారం సినిమాలో బుష్ పాత్రా కూడా పోషించాడు కాబట్టి నేను అమెరికా వాడిని అంటాడేమో అని కూడా సందేహం.ఇక చైనా వాడి పాత్రా కూడా వేసాడు కాబట్టో చైనా కి చెందిన వాడిని అంటాడు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

అయన అంటూనే ఉంటాడు.రాయడానికి బోలెడన్ని సైట్లు, మీడియా ఉండనే ఉంది.

Advertisement

కాబట్టి చెప్పాచ్చేది ఏమిటి అంటే కమలుడు కేవలం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక పెళ్ళానికి ఫిక్స్ అయ్యే మనిషి కాదు.అందుకే పెద్దగా ఆ చర్చ పెట్టుకునే పని కూడా అవసరం లేదు.

తాజా వార్తలు