త్యాగరాజ స్వామిపై కమల్ హసన్ అభ్యంతరకర వ్యాఖ్యలు

సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హసన్ ఎంత గొప్ప నటుడైన కావచ్చు.

కాని అతని నోటి దురుసుకి ఎప్పుడు ఎవరో ఒకరితో చివాట్లు తింటూ ఉంటాడు.

అలాగే అతని ప్రవర్తనతో వివాదాలకి కారణం అవుతాడు.నిజానికి కమల్ హసన్ దేవుడుని విశ్వసించడు.

కాని ఎక్కువగా హిందూ వ్యతిరేకిగా హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా వాఖ్యలు చేస్తూ ఉంటాడు.తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఉండటంతో వివాదాస్పదంగా మారాయి.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కమల్ హసన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు అంటూ హిందువులు ఆరాధ్యంగా భావించే సంగీత విద్వాంసుడు త్యాగరాజ స్వామిపై అభ్యంతరకర వాఖ్యలు చేశారు.

Advertisement

తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్ లో కమల్ పాల్గొన్నారు.చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా అంటే ఛారిటీ కాదని, టికెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారమని చెప్పారు.

త్యాగరాజ స్వామిలా రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది కర్ణాటక సంగీతకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కమల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సంగీతకారుడు పాల్ ఘాట్ రామ్ ప్రసాద్ ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ కు మద్దతుగా ఇప్పటి వరకు 16 వేల మందికి పైగా సంతకాలు చేయడం గమనార్హం.

ఇక కమల్ హసన్ వాఖ్యలపై సుబ్రహ్మణ్యం స్వామికూడా స్పందించారు.కమల్ అప్పుడప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా చిన్న పిల్లల మాదిరి తెలివి లేకుండా మాట్లాడుతూ ఉంటాడని ఘాటుగా విమర్శించారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
ఆ విషయంలో చిరంజీవి బాలకృష్ణ సేమ్ టూ సేమ్.. బాబీ కామెంట్స్ వైరల్!

అయితే ఇంత వ్యతిరేకత వస్తున్న కమల్ హసన్ మాత్రం ఈ వాఖ్యలపై ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు